Friday, May 3, 2024

నిరుపేదలకు చేయూత సీఎంఆర్ఎఫ్ : ఎమ్మెల్యే దాసరి

నిరుపేదలకు సీఎంఆర్ఎఫ్ ద్వారా చేయూతను అందిస్తున్నామని పెద్దపెల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పేర్కొన్నారు. ఈరోజు ఎమ్మేల్యే క్యాంపు కార్యాలయంలో 44 మంది లబ్ధిదారులకు 26 లక్షల 77 వేల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి, కాల్వ శ్రీరాంపూర్ ఎంపీపీలు స్రవంతి శ్రీనివాస్, నునేటి సంపత్, కాల్వశ్రీరాంపూర్ జ‌డ్పీటీసీ వంగల తిరుపతిరెడ్డి, పెద్దపల్లి పట్టణ అధ్యక్షులు ఉప్పు రాజ్, నాయకులు వాసు, రాజయ్యలతో పాటు లబ్ధిదారులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement