Saturday, May 4, 2024

బిగ్​ ఎంటర్​టైన్​మెంట్​.. 24/7, నో బ్రేక్​ అంటున్న నాగార్జున.. ప్రారంభం ఎప్పుడంటే!

రియాల్టీ షోకు ఉన్న క్రేజ్ గురించి అందరికీ తెలిసిందే. దాదాపు అన్ని భాషల్లోనూ బిగ్​బాస్​ షోకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. ఇప్పటికే హిందీలో 15 సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఇక తెలుగుతోపాటు.. తమిళ్, మలయాళంలోనూ బిగ్‏బాస్ రియాల్టీ షోకు మంచి రెస్పాన్స్ వస్తోంది. తెలుగులో కూడా  సీజన్ 5 ఘనంగా ముగిసింది. ఈ సీజన్ 5 గ్రాండ్ ఫినాలే రోజున హోస్ట్ నాగార్జున.. ఫిబ్రవరిలో మళ్లీ బిగ్‏బాస్ సందడి ఉంటుందని ప్రకటించారు. దీంతో బిగ్‏బాస్ సీజన్ 6 ఎప్పుడు స్టార్ట్​ అవుద్దంటూ చాలామంది ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. అయితే బిగ్‏బాస్ సీజన్ 6 కాదని.. బిగ్‏బాస్ ఓటీటీ (Bigg Boss OTT) అని.. ఇకపై 24 గంటలు షోను వీక్షించవచ్చని నిర్వాహకులు తెలిపారు. దీనికి సంబంధించిన ప్రోమో కూడా రిలీజ్​ చేశారు. ఇందులో నాగార్జున నో బ్రేక్​.. ఫుల్​ ఎంటర్​టైన్​మెంట్​ అంటూ సందడి చేయడం కనిపిస్తోంది.

కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో బిగ్‏బాస్ ఓటీటీ గురించి అనేక రకాల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పటికే ఈ షోలో పాల్గొనే కంటెస్టెంట్స్ లీస్ట్ ఫైనల్ అయ్యిందని.. ఇందులో మాజీ కంటెస్టెంట్స్ తోపాటు.. కొత్తవారు కూడా పాల్గొనబోతున్నారంటూ టాక్ నడుస్తోంది. గత సీజన్లలో పాల్గొన్న ముమైత్ ఖాన్, ఆదర్శ్, తనీశ్, ధన్ రాజ్, అరియానా, అఖిల్ పాల్గొంటారని సమాచారం. అలాగే యాంకర్ వర్షిణి, యాంకర్ శివ, డ్యాన్స్ షో డీ 10 విజేత రాజు, టిక్ టాక్ స్టార్ దుర్గారావు, సాఫ్ట్ వేర్ డెవలపర్ ఫేమ్ వైష్ణవి చైతన్య, శ్రీహాన్ పాల్గోనబోతున్నట్లుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement