Wednesday, April 24, 2024

ఫారెస్ట్​ ఫైర్​కి, లోకల్​ ఫైర్​కి తేడా ఉండాలిగా.. భీమ్లా నాయక్​ ట్రైలర్​పై థమన్​ రియాక్షన్​

ఎంతో కాలం ఎదురు చూసిన తర్వాత భీమ్లా నాయక్ సినిమా ట్రైలర్ విడుదల అయ్యింది. ఇందులో నటిస్తున్న పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటితో పాటు హీరోయిన్‌గా నటిస్తున్న నిత్యా మీనన్, సంయుక్త మీనన్ క‌నిపించారు. వారితో పాటు మురళీ శర్మ, రావు రమేష్ కూడా ఉన్నారు. మామూలుగా పవన్ కళ్యాణ్ సినిమా అంటే భారీ అంచనాలు ఉంటాయి. ఇప్పుడు ఈ సినిమా మీద కూడా అలాగే ఉన్నాయి. వకీల్ సాబ్ ట్రైలర్ చూసినప్పుడు ఈ సినిమా గ్యారెంటీగా హిట్ అవుతుంది అనే ఒక నమ్మకం ప్రేక్ష‌కుల్లో వచ్చింది. కానీ, ఈ సినిమా ట్రైలర్ చూస్తుంటే మాత్రం అంత హైప్ క్రియేట్ అవ్వడం లేదు అంటున్నారు కామ‌న్ పీపుల్‌. అలాగే ట్రైలర్ లో కూడా చాలావరకూ అంతకుముందు విడుదలైన వీడియోల్లో, పోస్టర్స్ లో చూపించిన షాట్స్ మాత్రమే ఉండ‌డం నిరాశ‌కు గురిచేస్తోంది.

అంతేకాకుండా మ్యూజిక్ డైరెక్టర్ తమన్ అంటే ఎక్ప్‌పెక్టేష‌న్స్‌ ఒక రేంజ్ లో ఉంటాయి. కాగా, భీమ్లా నాయ‌క్‌ సినిమా పాటలు విడుదలై అవి సూప‌ర్ హిట్ అయ్యాయి. అంతకు ముందు సినిమాకి సంబంధించి విడుదల చేసిన వీడియోస్ లో కూడా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ హైలెట్ అయ్యింది. దాంతో ట్రైలర్ లో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంటుంది అని అనుకున్నారు. కానీ, ట్రైలర్ చూస్తే చాలా ప్లెయిన్ గా అనిపించిందంటున్నారు అభిమానులు. ఒక్క చోట కూడా మ్యూజిక్ పవర్ ఫుల్ గా లేదన్న కామెంట్స్ వ‌స్తున్నాయి..

ట్రైల‌ర్ నెగిటివ్ టాక్ పై రియాక్ట్ అయిన‌ త‌మ‌న్.. ‘‘అన్నీ ట్రైల‌ర్ లోనే చూసేస్తే ఎలా.. ఫారెస్ట్ ఫైర్ కి లోక‌ల్ ఫైర్ కి తేగా ఉండాలిగా థియేటర్ లో క‌లుద్దాం” అంటూ ఓ పోస్ట్ వేసి భీమ్లా బీజీఎమ్ గేమ్‌కు మసాలాగా పెంచాడు.. మ‌రి అభిమానుల అంచ‌నాల‌ను అందుకుంటాడో లేదో థియెట‌ర్ లోనే చూద్దాం అంటున్నారు ప‌వ‌న్‌ అభిమానులు..

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement