Thursday, February 29, 2024

నిన్న లేగదూడ..నేడు బర్రెల మంద.. భూపాలపల్లి జిల్లాలో పెద్దపులి హడల్

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. సోమవారం(డిసెంబర్ 6) లేగదూడపై దాడి చేసి చంపేసిన పులి.. తాజాగా బర్రెల మందపై దాడి చేసింది. కాటారం మండలం గుమ్మళ్ళపల్లి-వీరాపూర్ మధ్య అడవి ప్రాంతంలో చెరువు వద్ద మేతకు వెళ్లిన బర్రెల మందపై దాడి చేసింది. రెండు బర్రెలను పులి చంపేసింది. దీంతో భయభ్రాంతులకు గురైన బర్ల కాపారి పోలీసులు సమాచారం అందించాడు. దాంతో సంఘటన స్థలానికి వెళ్లిన పోలీసులు, అటవీశాఖ అధికారులు పులి సంచారంపై నిఘా పెట్టారు. పెద్దపులి సంచారంతో అటవీ సమీప గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement