Monday, April 29, 2024

భోళా శంక‌ర్ న్యూ పోస్ట‌ర్ – చిరంజీవి లుక్ అదుర్స్

ద‌ర్శ‌కుడు మెహ‌ర్ ర‌మేశ్ డైరెక్ష‌న్ లో వ‌స్తోన్న చిత్రం భోళా శంక‌ర్. ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా న‌టిస్తున్నారు. కాగా నేడు మ‌హాశివ‌రాత్రి ప‌ర్వ‌దినం సంద‌ర్భంగా ఈ సినిమా నుంచి మెగాస్టార్ న్యూ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ పోస్ట‌ర్ లో చిరంజీవి మరింత స్టైల్ గా కనిపిస్తున్నారు. తమిళంలో కొంతకాలం క్రితం హిట్ కొట్టిన ‘వేదాళం’ సినిమాకి ఇది రీమేక్. తమన్నా కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో, చిరంజీవికి చెల్లెలి పాత్రలో కీర్తి సురేశ్ కనిపించనుంది. మహతి స్వరసాగర్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఆ తరువాత ప్రాజెక్టుగా చిరంజీవి ‘వాల్తేరు వీర్రాజు’ చేస్తున్న సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement