Friday, April 26, 2024

భీమ్లానాయ‌క్ – హాట్ స్టార్ తో పాటు ఆహాలో కూడా

డిస్నీప్ల‌స్ హాట్ స్టార్ లో భీమ్లా నాయ‌క్ చిత్రాన్ని స్ట్రీమ్ చేయ‌నున్నారు. కాగా హాట్ స్టార్ తో పాటు మరో ఓటీటీలోనూ భీమ్లా నాయక్ ను స్ట్రీమ్ చేయనున్నట్టు చిత్ర బృందం ప్రకటించింది. ‘ఆహా’లోనూ ఈ నెల 25 నుంచే పవర్ ప్యాక్డ్ ‘భీమ్లా నాయక్’ అందరికీ మరింత చేరువ కానుంది. అటు డిస్నీ ప్లస్ హాట్ స్టార్, ఇటు ఆహా.. ఒకేసారి రెండు ఓటీటీల్లో సినిమా విడుదలవుతుండడంతో అభిమానులు ఖుషీ అవుతున్నారు. ఈ విషయాన్ని వెల్లడిస్తూ ఆహా, డిస్నీప్లస్ హాట్ స్టార్ లు ట్వీట్ కూడా చేశాయి. ‘‘వచ్చే శుక్రవారం ఈ టైమ్ కి.. ‘పవర్ స్టార్మ్’ మీ ఇంటికి వచ్చేస్తుంది. తేదీలను గుర్తుపెట్టుకోండి.. క్యాలెండర్ ను ఖాళీగా ఉంచుకోండి.. మార్చి 25 నుంచే మీ ఆహాలో భీమ్లా నాయక్’’ అని పేర్కొంటూ ఆహా ట్వీట్ చేసింది. హాట్ స్టార్ లోకి భీమ్లానాయక్ వచ్చేస్తున్నాడు.. మార్చి 25 నుంచి అధికారం, కర్తవ్యం మధ్య తిరుగులేని యుద్ధానికి అంతా సిద్ధం కండి అంటూ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ట్వీట్ చేసింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement