Thursday, May 2, 2024

పవన్ అభిమానులకు గుడ్ న్యూస్.. రేపే భీమ్లా నాయక్‌ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌..

పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ అభిమానులకు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం భీమ్లా నాయక్‌. ఫిబ్రవరి 25న ఈ మూవీ రిలీజ్ కానుంది. అయితే, భీమ్లా నాయక్‌ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ ఉంటుందా? లేదా? అన్న సస్పెన్స్ అభిమానుల్లో నెలకొంది. అయితే దీనిపై మూవీ యూనిట్ క్లారిటీ ఇచ్చింది. భీమ్లా నాయక్‌ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను బుధవారం నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ట్విట్టర్‌ వేదికగా అధికారికంగా ప్రకటించింది. హైదారాబాద్‌ యూసుఫ్‌గూడలోని పోలీస్‌ గ్రౌండ్స్‌లో బుధవారం సాయంత్రం 6:30 గంటల నుంచి ఈ ఈవెంట్‌ ప్రారంభం కానుంది. ఈ వేడుకకు తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ ముఖ్య అథితిగా హాజరుకానున్నారు.

కాగా, భీమ్లా నాయక్‌ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను సోమవారం నిర్వహించాల్సి ఉంది. అయితే, ఆంధ్రప్రదేశ్‌ మంత్రి గౌతమ్‌ రెడ్డి అకాల మరణంతో ఈవెంట్‌ను వాయిదా వేస్తూ చిత్ర యూనిట్ నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి 25న సినిమా విడుదల అవుతున్న నేపథ్యంలో రేపు ఈవెంట్‌ నిర్వహించాలని నిర్ణయించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement