Sunday, April 28, 2024

డీజీపీగా భవ్రా నియామకం.. ఎన్నికల ప్రకటనకు ముందే బాధ్యతలు..

పంజాబ్ ప్రభుత్వం శనివారం కొత్త డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌ (DGP)గా వీకే భవ్రాను నియమించింది. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆఫర్ చేసిన ముగ్గురు అభ్యర్థుల జాబితా నుండి Mr భావ్రా ఎంపికయ్యారు. మిగిలిన జాబితాలో దినకర్ గుప్తా, ప్రబోధ్ కుమార్ ఉన్నారు. సీఎం చరణ్‌జిత్ చన్నీ అధికారం చేపట్టిన తక్కువ కాలంలో అంటే దాదాపు 100 రోజుల వ్యవధిలోనే మూడో నియామకం జరిగింది. కాగా, ఎన్నికల సంఘం పంజాబ్ ఎన్నికల తేదీలను ప్రకటించడానికి కొద్దిసేపటి ముందు డీజీపీని నియమించడం గమనార్హం.

ఈ వారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కాన్వాయ్‌కు సంబంధించిన భద్రతా లోపాలపై పంజాబ్ పోలీసులు అడ్డగోలుగా వ్యవహరించారని కేంద్రం గుర్తించినందున ఈ మార్పు అనివార్యం అయ్యింది. ఫిరోజ్‌పూర్ జిల్లాలోని ఒక ఫ్లై ఓవర్‌పై ప్రధాని కాన్వాయ్ ని 20 నిమిషాల పాటు నిలిపి ఉంచడానికి దారితీసిన పరిస్థితులపై ఆరా తీస్తున్న కేంద్ర హోం మంత్రిత్వ శాఖ బృందం ఇంతకుముందు ఉన్న పంజాబ్ DGP సిద్ధార్థ్ చటోపాధ్యాయ, ఇతర సీనియర్ అధికారులందరిపై వేటు వేసింది.

కాగా, వీరేష్ కుమార్ భవ్రాకు రెండేళ్ల పదవీకాలం ఉంటుంది. కాంగ్రెస్ పాలిత రాష్ట్రంలోని టాప్ కాప్‌గా డిసెంబర్‌లో మాత్రమే నియమించబడిన మిస్టర్ చటోపాధ్యాయ స్థానంలో ఆయన నియమితులయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement