Sunday, April 28, 2024

కొవిడ్ గర్భిణులకు ఆ ఆస్పత్రే దేవాలయం!

నిర్మల్​ జిల్లాలోని భైంసా ప్రాథమిక ఆస్పత్రి వైద్య సిబ్బంది ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు. కొవిడ్​ బారిన పడిన గర్భిణులకు అండగా నిలుస్తూ.. వైద్య సేవలు అందిస్తూ ప్రసవాలు చేస్తున్నారు. కొన్ని ప్రైవేటు ఆస్పత్రుల్లో కొవిడ్​ సోకిన గర్భిణులకు వైద్యం అందించడం లేదు. ఈ సమయంలో కొవిడ్​ సోకిన గర్భిణులకు నిర్మల్​లోని భైంసా ప్రాథమిక ఆస్పత్రి దేవాలయంలా మారింది. తమ బిడ్డలకు జన్మనిచ్చే గర్భగుడిలా కనిపిస్తోంది.

కరోనా సోకింద నగానే బంధుమిత్రులందరూ దూరమవు తున్న వేళ కరోనా సోకిన గర్భిణులను ఆరోగ్య సిబ్బంది అక్కున చేర్చుకుంటున్నారు . వారికి అవసరమైన చికిత్సలు అందిస్తూ ప్రసవాలు చేసి పండంటి బిడ్డలకు జన్మనిచ్చేలా చేసి తల్లి బిడ్డలను సురక్షితంగా ఇళ్లకు పంపుతున్నారు . కరోనా విజృంభిస్తున్న వేళ ప్రైవేటు ఆసుపత్రులు శుచి , శుభ్రతగా ఉంటాయని, అక్కడ రోగుల రద్దీ ఉండదని కొవిడ్ బారినపడ్డ గర్భి ణులు అక్కడికి వెళ్తే నిర్వాహకులు ససేమిరా అన్నారు . దీంతో దిక్కుతోచని వారి కుటుంబీకులు నిర్మల్ జిల్లా భైంసాలోని ప్రాంతీయ ఆసుపత్రిని ఆశ్ర యించారు . అక్కడి వైద్యుల సూచనల మేరకు ప్రసూతి విభాగం ఆరోగ్య సిబ్బంది సువర్ణ , త్రివేణి , శైలజ , సునిత , మంజూష కరోనా చికి త్సలు ఇస్తూనే గర్భిణులకు శారీరక వ్యాయా మాలు చేయించి సాధారణ ప్రసావాలు జరిగేలా చూశారు. వారి కృషి ఫలించి జిల్లానే మొట్టమొ దటి సారిగా ఈ నెల 2న పురుడు పోశారు . ఇప్పటి వరకు ఎనిమిది మంది కొవిడ్ బాధిత గర్భిణులు కాన్పుల కోసం రాగా ఏడుగురికి సాధారణ ప్రసవాలు చేసి పండంటి నవజాత శిశువులకు జన్మ ప్రసాదించారు . కుభీరు మండలానికి చెందిన ఒక గర్భిణీకి తప్పని పరిస్థితుల్లో  డాక్టర్ వనిత శస్త్రచికిత్స ద్వారా పురుడు పోశారు.

వైద్య వృత్తిలో ఉంటూ తమవంతుగా గర్భిణులకు సాయం చేస్తున్నామని వైద్యులు, సిబ్బంది తెలిపారు. తన తోటి సిబ్బంది, అనాస్తియా వైద్యుల సహకారంతో ప్రసవాలు చేస్తున్నామని డాక్టర్ వనిత అన్నారు. ఇప్పటి వరకు 8 నార్మల్ ప్రసవాలు అత్యవసర సమయంలో ఒక ఆపరేషన్ చేశామని తెలిపారు. తల్లి బిడ్డలు క్షేమంగా ఉన్నారని  డాక్టర్ చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement