Saturday, April 20, 2024

కరోనాతో ఆందోళనవద్దు – ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్

గూడూరు: కరోనా వైరస్ పట్ల ప్రజలు ఆందోళన చెందవద్దని ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ రామకృష్ణ అన్నారు. శనివారం స్థానిక ఏరియా ఆస్పత్రిలోని ఆయన కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కరోనా సెకండ్ వేవ్ చాలా తీవ్రంగా ప్రబలుతోందన్నారు. నిమిషానికి 20 కేసులు నమోదవుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయన్నారు. కరోనా వైరస్ పట్ల అనవసరంగా ఆందోళన చెందొద్దని ప్రజలకు సూచించారు. 90 శాతం ప్రజలకు కరోనా వచ్చేదీ..వెళ్లేది కూడా తెలియదన్నారు. కేవలం పదిశాతం మంది మాత్రమే ఇబ్బందులు పడుతారన్నారు. అందులోనూ ఐదు శాతం మందికి మాత్రమే సీరియస్ అవుతోందన్నారు. అనవసరంగా ఆందోళన నహపడి ఆస్పత్రులకు ప్రస్తుత పరిస్థితుల్లో పరుగులు తీయడం మంచిది కాదన్నారు. ఇళ్లలోనే ఉంటూ మందులు తీసుకుంటూ మంచి ఆహారం తీసుకోవాలన్నారు. అలాగే అత్యవసమైతేనే ఇళ్ల నుండి బయటకు రావాలన్నారు. తప్పనిసరిగా మాస్కు ధరించి, భౌతిక దూరం పాటిస్తూ శానిటైజర్ కలిగి ఉండాలన్నారు. జాగ్రత్తలు పాటిస్తే కరోనా దరి చేరదన్నారు. ఏరియా ఆస్పత్రిలో అత్యవసర సేవలకు గాను 20 పడకలు, ఐసీయూ సిద్ధం చేశామన్నారు. అలాగే టిడ్కో భవనాలలోనూ ఐసోలేషన్ సెంటర్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement