Sunday, April 28, 2024

బెంగాల్ బెబ్బులి మమతా బెనర్జీ – ‘శ‌త్రుఘ్న సిన్హా’

కాంగ్రెస్ పార్టీని వీడి తృణ‌మూల్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు అల‌నాటి బాలీవుడ్ న‌టుడు, రాజ‌కీయ నాయ‌కుడు శ‌త్రుఘ్న సిన్హా. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ..‘బెంగాల్ బెబ్బులి మమతా బెనర్జీ’ అంటూ కొనియాడారు. ‘‘బెంగాల్ బెబ్బులి, విజయవంతమైన సీఎం మమత పిలుపు మేరకు తృణమూల్ కాంగ్రెస్ లో చేరడం చాలా ఆనందంగా ఉంది. ఓ గొప్ప మహిళ, గొప్ప నేత, గొప్ప నాయకత్వం మమత అడుగుజాడల్లో అసన్సోల్ నుంచి పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నా’’ అంటూ ట్వీట్ చేశారు.బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై శత్రుఘ్న సిన్హా ప్రశంసల వర్షం కురిపించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement