Sunday, April 28, 2024

బీస్ట్ మూవీ రివ్యూ – ఎలా ఉందంటే

త‌మిళ స్టార్ హీరో విజ‌య్ న‌టించిన తాజా చిత్రం బీస్ట్ నేడు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. మ‌రి ఆ చిత్రం హిట్టా ఫ‌ట్టా ఆ సంగ‌తులు..సినిమా ఎలా ఉందో రివ్యూ తెలుసుకుందాం..ఈ చిత్రంలో విజ‌య్ స్టైలిష్ ..ప‌వ‌ర్ ఫుల్ పెర్ఫామెన్స్ తో అద‌ర‌గొట్టాడు.
ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ నిర్మాణంలో నెల్సన్ దిలీప్ కుమార్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇప్పటి వరకు నయనతారతో కోకిల, శివ కార్తికేయన్‌తో డాక్టర్ సినిమాలను డైరెక్ట్ చేసిన సూపర్‌హిట్ సొంతం చేసుకున్న నెల్సన్ దిలీప్ కుమార్ .. విజయ్‌తో ఎలాంటి సినిమా చేస్తారోనని అందరిలో తెలియని ఆసక్తి నెలకొంది.

ఈ చిత్ర క‌థ షాపింగ్‌ మాల్‌ చుట్టూ తిరిగింది. ఓ మాల్‌ని ఉగ్రవాదులు ఎటాక్‌ చేయడంతోపాటు హైజాక్‌ చేస్తారు. వారి అదీనంలో కొంత మంది అమాయక ప్రజలుంటారు. ఉగ్రవాదుల నుంచి అమాయక ప్రజలను కాపాడేందుకు విజయ్‌(రా ఏజెంట్ వీర రాఘవ) ఏం చేశాడు, షాపింగ్‌ మాల్‌లో ఏం జరిగింది, విజయ్‌ గతం ఏంటి? అనేది సినిమా కథగా రూపొందింది.రా ఏజెంట్ వీర రాఘవన్ (విజయ్) మొదటి మిషన్ ఉన్నతమైనదికాగా, ఉమర్ ఫరూక్‌ను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఉగ్రవాదులు మాల్‌ను హైజాక్ చేస్తారు. ఆ సమయంలో ప్రభుత్వం ఉమర్‌ని వదిలేసిన కూడా తర్వాత విజయ్ ఆ వ్యక్తిని ఎలా పట్టుకున్నాడనే నేపథ్యంలో చిత్రాన్ని ఆసక్తికరంగా తెరకెక్కించారు.

ఎవ‌రు ..ఎలా న‌టించారంటే ..వీర రాఘవన్ పాత్రలో విజయ్ అద‌ర‌గొట్టాడు. పూజా హెగ్డే తన డ్యాన్స్ తో, అందంతో ఆకట్టుకుంటోంది. ఉగ్రవాదాలు దాడి సమయంలో విజయ్ పర్‌ఫార్మెన్స్ ప్రేక్షకులకి మంచి ఫీస్ట్ అందిస్తుంది. కొన్ని సన్నివేశాలలోమిగతా పాత్రధారులు కూడా అద్భుతంగా నటించారు.

టెక్నికల్ ప‌రంగా ఎలా ఉందంటే ..ఇప్పటి వరకు నయనతారతో కోకిల, శివ కార్తికేయన్‌తో డాక్టర్ సినిమాలను డైరెక్ట్ చేసిన సూపర్‌హిట్ సొంతం చేసుకున్న నెల్సన్ దిలీప్ కుమార్ సినిమాని అంతగా ముందుకు తీసుకెళ్లలేకపోయాడు. నెల్సన్ దిలీప్ కుమార్ ఈ చిత్రంలో హాస్యాన్ని కూడా మిళితం చేశారు. కానీ కామెడీ అంతగా వర్కౌట్ కాలేదు. అనిరుద్ మాత్రం తన బ్యాగ్రౌండ్ స్కోర్ తో మెస్మరైజ్ చేస్తున్నాడు. స్క్రీన్ ప్లే రేసీగా ఉంటుంది. కొన్ని యాక్షన్ బ్లాక్స్ ఆకట్టుకుంటాయి. కానీ కొన్ని సన్నివేశాలు రిపీటెడ్ గా అనిపిస్తాయి. నెల్సన్ దిలీప్ కుమార్ విజయ్ అభిమానులని దృష్టిలో పెట్టుకునే ఈ కథకు ట్రీట్మెంట్ ఇచ్చాడనిపిస్తోంది. ఏది ఏమైనా కూడా సినిమా చూసే ప్రేక్ష‌కుల మైండ్ సెట్ ని బ‌ట్టి హిట్టా..ఫ‌ట్టా అని తేలాల్సి ఉంటుంద‌న్న సంగ‌తి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement