Tuesday, May 7, 2024

రజాకార్ల రాజ్యాన్ని పాతరేస్తాం…. రామరాజ్యాన్ని స్థాపిస్తాం – బండి సంజయ్

కరీంనగర్ -రజాకార్ల రాజ్యాన్ని పాతరేసి రామరాజ్యాన్ని స్థాపించేందుకే ‘‘హిందూ ఏక్తా యాత్ర’’ నిర్వహిస్తున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ప్రకటించారు. అందులో భాగంగానే తెలంగాణ అంతటా హిందుత్వ వాతావరణాన్ని తీసుకొస్తానని చెప్పారు. హిందుత్వం లేకుంటే దేశం పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఝనిస్తాన్ లాంటి పరిస్థితులు ఉత్పన్నమయ్యేవన్నారు. కర్నాటకలో హిందుత్వాన్ని కాపాడే పార్టీ అధికారం కోల్పోవడంవల్లే పాకిస్తాన్ జిందాబాద్ అంటూ అక్కడ నినాదాలు చేసే దుస్థితి నెలకొందన్నారు. శనివారం సాయంత్రం కరీంనగర్ లో అసోం సీఎం హిమంత బిశ్వశర్మతో కలిసి హిందూ ఏక్తా యాత్ర నిర్వహించారు. ఈ యాత్రకు వేలాదిగా జనం తరలివచ్చారు. హిందుత్వ సైనికులతో కరీంనగర్ యావత్తు కాషాయ సంద్రమైంది.

ఈ సందర్భంగా వారిని ఉద్దేశించి బండి సంజయ్ మాట్లాడుతూ హిందూ ఏక్తా యాత్రలో పాల్గొనడానికి వచ్చిన హిందూ టైగర్ అసోం సీఎం హిమంత బిశ్వ శర్మకు ధన్యవాదాలు తెలిపారు కరీంనగర్ వేదికగా హిందూ సమాజానికి సేవ చేసే అద్రుష్టం రావడం పూర్వ జన్మ సుక్రుతం అన్నారు. కరీంనగర్ గడ్డకు రుణపడి ఉంటా. హిందు సమాజానికి హాని చేసే వాళ్ల కోసం జైలుకెళ్లిన.
మీరంతా ఆశీర్వదించండి… తెలంగాణ మొత్తం హిందుత్వ వాతావరణం తీసుకురావాలే. కుహానా లౌకిక వాదుల ఆటకట్టించడానికే ఏక్తా యాత్ర. మన ఐక్యతను చాటాలనే ఉద్దేశంతోనే సాగుతున్న యాత్ర. అన్నారు.
కర్నాటక ఎన్నికలైనయ్. హిందుత్వం మాట్లాడొద్దని అంటున్నాయి. హిందుత్వం మాట్లాడితే అధికారంలోకి రాదని అంటున్నారు..ఇది వాస్తవమా? అట్లాంటోళ్లంతా ఇఫ్పుడు ఈ గడ్డమీదకొచ్చిన హిందూ ధర్మ రక్షకుల సందోహాన్ని చూడండి అన్నారు. కుహానా లౌకిక వాదులకు హిందూ సంఘటిత శక్తిని చాటేందుకే ఈ హిందూ ఏక్తా యాత్ర అన్నారు.
ఎవడైతే 15 నిమిషాలు టైమిస్తే మనల్ని చంపుతానని అన్నడో… అట్లాంటోళ్లను రోడ్లమీద ఉరికించడానికి ఇంకా 5 నెలలే ఉందన్నారు.
కర్నాటకలో కాంగ్రెస్ గెలిస్తే… పాకిస్తాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేస్తున్నారని ఇయాళ హిందూ ధర్మం కోసం ఆలోచించే పార్టీ లేకపోవడంవల్లే పాకిస్తాన్ జిందాబాద్ అనే దుస్థితి వచ్చిందన్నారు.
ఒక్క రాష్ట్రంలో బీజేపీ గెలవకపోతే ఏమైతది? 15పైగా రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉంది అన్నారు. ఇక్కడొచ్చినవాళ్లంతా 5 నెలల టైమివ్వండి…
•ఈ దేశంలో హిందుత్వం లేకపోతే ఈ దేశం ముక్కలయ్యేది. పాకిస్తాన్, బంగ్లాదేశ్, అప్ఝనిస్తాన్ అయ్యేది… ఒక్కసారి ఆలోచించండి. హిందుత్వం లేకుండా భారత్ లేదు అన్నారు.
నిన్నగాక మొన్న ఎంఐఎం నేతల మెడికల్ కాలేజీలో టెర్రరిస్టును హెచ్ఓడిగా నియమించుకున్నారంటే పరిస్థితి ఎట్లా ఉందో ఆలోచించండి అన్నారు. అట్లాంటి వాళ్లకు బుద్ది చెప్పాల్సిన సమయం ఆసన్నమైందని పిలుపునిచ్చారు.
80 శాతం జనాభా ఉన్న హిందువుల వాటా సచివాలయంలో రెండున్నర గుంటలా? సచివాలయం మాదే.. నల్ల పోచమ్మ గుడిని స్వర్ణ దేవాలయంగా మార్చే అవకాశం మాకివ్వండి. అన్నారు
నిజాం మెడలు వంచిన ప్రాంతమిది. సీఎం గద్దెనెక్కిన తరువాత నిజాం సమాధి వద్దకు పోయి మోకరిల్లిండు. నిజాం మనవడు ఇస్తాంబుల్ లో చస్తే ఇక్కడ అధికార లాంఛనాలతో అంత్యక్రియలు చేశారో… అట్లాంటి వాళ్లకు గుణపాఠం చెప్పాలి అన్నారు.

రాజన్న, దుర్గమ్మ, అంజన్న, కాళేశ్వర ముక్తేశ్వర స్వాముల ఆశీర్వాదం ఉంది. హిందుత్వంపై తప్పుడు ప్రచారం జరుగుతోంది. నమ్మకండి అన్నారు.
ఒకనాడు హిందువుంటే దేశ బంధు.. ఇయాళ హిందువుంటే అన్నీ బంద్ పెడుతున్నరు హిందువులంతా ఏకం కావాల్సిన అవసరం ఉందన్నారు.
తెలంగాణలో హిందువుల రక్తం సలసల మసలుతోంది. నిన్నగాక మొన్న జగిత్యాలలో మామూలు ఎస్ఐ భార్య ఆర్టీసీ బస్సులో చిన్న పసిపాపకు పాలిస్తానంటే బుర్ఖ వేసుకున్న మహిళ ఎంతగా అవమానించిందో… ఎస్ఐను సస్పెండ్ చేసిన సంగతిని మర్చిపోదామా? నిరసనగా స్వచ్ఛంద బంద్ పాటించిన జగిత్యాల ప్రజలకు హ్యాట్సాఫ్ తెలిపారు.
ఎంఐఎం నాయకులు యాడ ఉన్నరు? ట్రిపుల్ తలాఖ్ రద్దుతో ముస్లిం మహిళలకు మోదీ మంచి నిర్ణయం తీసుకుంటే ఎందుకు స్పందించరు అన్నారు. హిందువుల్లో ఐక్యత లేదని, ఓటు బ్యాంకు కాదని ఎవడెన్ని మొరిగినా… పట్టించుకోం… తెలంగాణలో రజకార్ల, బకాసురుల రాజ్యాన్ని అంతం చేసి రామరాజ్యాన్ని స్థాపించడమే లక్ష్యంగా పనిచేస్తాం అన్నారు.
లవ్ జిహాద్ గురించి చెబితే బీజేపోళ్లకు, భజరంగ్ దళ్ వాళ్లకు ఏం పనిలేదని విమర్శించారు. ఇయాళ కేరళలో హిందువులపై ఏ విధంగా దాడులు జరుగుతున్నాయో… లవ్ జిహాద్ పేరుతో అమ్మాయిలను ట్రాప్ చేసి ఎట్లా నరక కూపంలోకి నెడుతున్నారో అద్దం పట్టేలా కేరళ స్టోరీ తీశారు అంటూ వాళ్లకు హ్యాట్సాఫ్ తెలిపారు.
బాలగంగాధర్ తిలక్ హిందువులను సంఘటితం చేసేందుకు వినాయక ఉత్సవాలను ఎట్లా నిర్వహించారో… ఆ స్పూర్తితో తెలంగాణలో హిందువులందరినీ సంఘటితం చేసి రామరాజ్యం స్థాపించేందుకు ఈ యాత్ర చేపట్టినం అన్నారు. భాగ్యలక్ష్మీ వద్ద జరిగిన పాదయాత్ర ఎంతటి సంచలనం స్రుష్టించిందో…. ఈరోజు కరీంనగర్ లో జరిగిన హిందూ ఏక్తా యాత్ర అంతటి సంచలనం స్రుష్టించిందనడానికి ఇక్కడికి వచ్చిన విశేష జనమే ఉదాహరణ అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement