Saturday, May 4, 2024

బాల‌కృష్ణ – విల‌న్ లుక్ పోస్ట‌ర్ రిలీజ్

గోపీచంద్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వంలో హీరో బాల‌కృష్ణ ఓ చిత్రంలో న‌టిస్తున్నాడు. ఇది బాల‌య్య‌కి 107వ చిత్రం. ప్రస్తుతం ఈ సినిమా షూటింగు దశలో ఉంది. ఈ సినిమాలో విలన్ ఊరమాస్ లుక్ తో ఉంటాడట‌. ఎదుటివారు ఎవరైనా ఎంతమాత్రం లెక్కచేయని ఈ పవర్ఫుల్ విలన్ పాత్రలో కన్నడ స్టార్ దునియా విజయ్ కనిపించనున్నాడు. ఈ సినిమాలో ఆయన పాత్ర పేరు ముసలిమడుగు ప్రతాప్ రెడ్డి. ఆ పాత్రను .. ఆ పాత్రలో ఆయన లుక్ ను పరిచయం చేస్తూ కొంతసేపటి క్రితం పోస్టర్ ను రిలీజ్ చేశారు. అగ్గిపుల్లతో సిగరెట్ వెలిగించుకుంటూ దునియా విజయ్ వదిలిన లుక్ చాలు, ఈ సినిమాలో ఆయన పాత్ర ఎలా ఉంటుందో చెప్పడానికి. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాలో శ్రుతి హాసన్ కథానాయికగా నటిస్తుండగా, ఒక కీలకమైన పాత్రలో వరలక్ష్మి శరత్ కుమార్ కనిపించనుంది. తమన్ ఈ సినిమాకి సంగీతాన్ని సమకూర్చుతున్నాడు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement