Tuesday, January 25, 2022

మంత్రి హ‌రీశ్‌రావును క‌లిసిన బాల‌కృష్ణ‌.. కారణం ఏంటంటే..

తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావును బసవతారకం ఆస్పత్రి ఛైర్మన్, సినీ నటుడు బాలకృష్ణ కలిసారు. సోమవారం బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్, రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ప్రతినిధులు మంత్రి హరీష్ రావుతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా బసవతారకం ఇండో-అమెరికన్‌ క్యాన్సర్ హాస్పిటల్, రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూల్‌ అందిస్తున్న సేవలను, సంస్థ కార్యకలాపాలను బాలకృష్ణ మంత్రి హరీష్‌రావుకు వివరించారు. ఆస్పత్రి అభివృద్ధి అంశాలను మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ప్రభుత్వం తమకు మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అందుకు మంత్రి హరీష్ రావు సానుకూలంగా స్పందించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News