Friday, May 10, 2024

‘బేబీ బంప్’ తో సామీ సామీ సాంగ్ కి డ్యాన్స్

ఐకాన్ స్టార్ హీరో అల్లు అర్జున్ న‌టించిన పుష్ప చిత్రం మేనియా ఇప్ప‌ట్లో త‌గ్గెలే లేదు. ఈ చిత్రంలోని సామీ సామీ సాంగ్ కి విప‌రీత‌మైన క్రేజ్ ఏర్ప‌డింది. ఈ ఫీవ‌ర్ కేవ‌లం మ‌న దేశానికే ప‌రిమితం కాలేదు.. ఖండాంత‌రాల‌ను దాటింది. ఇప్ప‌టికే ప‌లువురు విదేశీ సెల‌బ్రిటీలు పుష్ప సినిమాలోని సాంగ్స్‌కు డ్యాన్స్ చేసి సోష‌ల్ మీడియాలో షేర్ చేశారు. ఆ వీడియోలు కూడా వైర‌ల్ అయ్యాయి. తాజాగా ఆక్లాండ్‌కు చెందిన ఓ గ‌ర్భిణీ సామీ సామీ పాట‌కు సూప‌ర్‌గా డ్యాన్స్ వేసి దాన్ని ఇన్‌స్టాలో షేర్ చేసింది. గ‌త వారం రోజుల నుంచి నా నోట్లో ఇదే పాట నానుతోంది. ఇదే పాట‌ను పాడుతున్నా. నిజానికి సామీ సామీ ట్రెండ్ ఎప్ప‌టి నుంచో ఉంది కానీ.. నేనే కొంచెం లేట్ అయ్యాను. అందుకే ఈ డ్యాన్స్ ట్రై చేశా. పుష్ప సినిమాను ఎంత‌మంది చూశారుద. నాకు ఇంకా చూసే స‌మ‌యం దొర‌క‌లేదు. ఈ వీక్ లిస్ట్‌లో ఉంది ఆ సినిమా.. అంటూ ఆ యువ‌తి పోస్ట్ చేసింది. ఇప్పుడీ వీడియో తెగ వైర‌ల్ గా మారింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement