Friday, May 17, 2024

Spl Story: 41 ఏళ్ల వయస్సులో గోల్డెన్​ చాన్స్​.. బాస్కెట్​బాల్​ వరల్డ్​కప్​కి లారెన్​ ఎంపిక

41 ఏళ్ల వయసులో ఓ క్రీడాకారిణికి గొప్ప చాన్స్​ దక్కింది. తన కెరీర్​లోనే ఇది బెస్ట్​ అని చెప్పొచ్చు. ఎందుకంటే అందరూ కలలు గన్నట్టే తనకూ ఓ కల ఉండేది. అయితే, అది ఇట్లా సాకారం అవుతుందని తను ఎప్పుడూ అనుకోలేదేమో. నాలుగుసార్లు ఒలింపిక్​ విజేతగా, విమెన్స్​ నేషనల్​ బాస్కెట్​బాల్​ స్టార్​ అసోసియేషన్​ ఆస్ట్రేలియాకు మొదటి సారి ఆడిన 25 ఏళ్ల తర్వాత ఈ చాన్స్​ రావడం అనేది చాలా గొప్ప విషయం.. ఆ అవకాశం ఇప్పుడు గ్రేట్​ లారెన్​ జాక్సన్​కు దక్కింది.​

బాస్కెట్‌బాల్ ప్లేయర్​ లారెన్ జాక్సన్ ఈ ఏడాది ప్రపంచ కప్‌కు ఎంపికయ్యారు. ఆమె తన 41 ఏళ్ల వయస్సులో ఆస్ట్రేలియా జట్టుకు ఎంపిక కావడం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. నాలుగుసార్లు ఒలింపిక్ పతక విజేత,WNBA స్టార్ ఆస్ట్రేలియాకు మొదటిసారి ఆడిన 25 సంవత్సరాల తర్వాత ఈ చాన్స్​ రావడం ఎంతో గొప్ప విషయంగా చెబుతోంది లారెన్​.

కాగా,  సెప్టెంబర్​లో సిడ్నీలో జరిగే మహిళల ప్రపంచ కప్‌ కోసం నిన్న (బుధవారం) ఒపల్స్ లైనప్‌లో సంచలనాత్మకంగా ఆమె పేరు చేర్చారు.  “నేను ఈ స్థాయికి చేరుకుంటానని ఎప్పుడూ ఊహించలేదు. కాబట్టి నాకు ఇది ఒక ఆశీర్వాదం లాంటిదనే చెప్పాలి. నేను నిజంగా ప్రపంచంలోని అత్యంత అదృష్టవంతులలో ఒకరిగా భావిస్తున్నాను. నా కెరీర్ ముగిసిన తర్వాత మరో సారి ఆట ఆడబోతున్నాను”అంటూ మీడియాకు చెప్పుకొచ్చింది.

‘‘నాకైతే ఇప్పుడు కొంచెం భయంగా కూడా ఉంది” అని లారెన్​ చెప్పింది. ‘‘నేను ముందు భయపడ్డా, ఆ తర్వాత ఎంతో సంతోషం అనిపించింది. ఆట ఆడాలన్న ఉత్సాహంగా ఉన్నా.. కానీ, నా బాడీ దానికి ఎట్లా సహకరిస్తుందో చూడాలి” అంటూ ఎమోషనల్​ అయ్యింది. ఆస్ట్రేలియాకు చెందిన గొప్ప మహిళా క్రీడాకారిణి అయిన లారెన్​ దాదాపు 20 సంవత్సరాల కెరీర్ తర్వాత మోకాలి గాయంతో 2016లో రిటైర్​మెంట్​ తీసుకుంది.  ఈ సమయంలో ఆమె యునైటెడ్ స్టేట్స్ యొక్క WNBAలో అత్యంత విలువైన క్రీడాకారిణిగా పేరు పొందిన మొదటి అమెరికన్. ఇప్పుడు తల్లి అయిన ఆమె తన స్వస్థలమైన క్లబ్ ఆల్బరీ వోడోంగా కోసం ఏప్రిల్‌లో మళ్లీ ఆడడం ప్రారంభించింది. ఒక్కో గేమ్‌కు సగటున 32.6 పాయింట్లు, 11.6 రీబౌండ్‌లు సాధించింది.

అంతర్జాతీయంగా మళ్లీ రావడం కోసం ఆమె తనను తాను నిరంతరం ఎంతో శ్రమించుకుంటోంది. కఠినమైన శిక్షణా విధానాన్ని అవలంభిస్తోంది. హాల్ ఆఫ్ ఫేమర్ జాక్సన్ జట్టులో తన స్థానాన్ని సంపాదించుకోవడానికి చాలా కష్టపడ్డారని ఒపల్స్ ప్రధాన కోచ్, ఆస్ట్రేలియా మాజీ సహచరుడు శాండీ బ్రోండెల్లో చెప్పారు. “లారెన్ ఒక గొప్ప అథ్లెట్, ప్రత్యర్థులకు గట్టి పోటీదారు అవుతుంది. ఆమె ఆటతీరు ఎంతో బాగుంటుంది. జట్టులో తన స్థానానికి అర్హరాలు. ఇది స్వదేశీ గడ్డపై జరిగే పోటీ కాబట్టి మేము ఈ తీవ్ర స్థాయి ఒత్తిడిని ఆహ్వానిస్తున్నాం” అని మీడియాతో అన్నారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement