Sunday, May 19, 2024

Breaking: యూపీలో కేంద్ర మంత్రి కాన్వాయ్ పై దాడి

కేంద్ర మంత్రి బఘేల్ కాన్వాయ్ పై దాడి జ‌రిగింది. ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికలు భారతీయ జనతా పార్టీ, సమాజ్ వాదీ పార్టీల మధ్య ప్రతిష్టాత్మకంగా జరుగుతున్నాయి. ఇప్పటికి రెండు దశల్లో ఎన్నికలు ముగిశాయి. అయితే ఉద్రిక్తతలు మాత్రం వీడటం లేదు. కేంద్ర మంత్రి బఘేల్ కాన్వాయ్ పై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి దిగారు. ఈ దాడిలో బఘేల్ కు ఎటువంటి ప్రమాదం జరగకపోయినా దాడిపై భారతీయ జనతా పార్టీ సీరియస్ అయింది. బఘేల్ సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ పై పోటీ చేస్తున్నారు. కర్హాల్ స్థానం నుంచి ఆయన బీజేపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ఈ దాడిని సమాజ్ వాదీ పార్టీ శ్రేణులే చేశాయని బీజేపీ ఆరోపిస్తుంది. పోలీసులు దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

అయితే ‘‘అఖిలేష్ యాదవ్ ఎన్నికల్లో ఓటమి భయంతో బీజేపీ అభ్యర్థి, కేంద్ర మంత్రి ప్రొఫెసర్ ఎస్పీ సింగ్ బఘేల్, బీజేపీ నేతలపై పెంపుడు గూండాల ద్వారా దాడి చేశారు. నిన్న బీజేపీ ఎంపీ గీతా శాక్యాపై కూడా దాడి చేశారు..ఈ దాడులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. ’’ అని మౌర్య వరుస ట్వీట్‌లలో పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement