Monday, April 29, 2024

Breaking: ఆర్మీ హెలికాప్ట‌ర్‌ ఎమ‌ర్జెన్సీ ల్యాండింగ్ .. చూడ్డానికి ఎగ‌బ‌డ్డ జ‌నం

మెద‌క్ జిల్లాలో ఆర్మీ హెల‌కాప్ట‌ర్ ఇవ్వాల ఎమ‌ర్జెన్సీ ల్యాండింగ్ అయ్యింది. జగదేవపూర్ మండల కేంద్రంలో గల అక్షర ఇంగ్లీష్ మీడియం పాఠశాల వెనకాల గల కాళీ స్థలంలో ఎయిర్ పోర్స్ హెలికెఫ్టర్ సంకేతిక లోపంతో క్రిందికి దిగింది. ప్రజలు ఎక్కువ సంఖ్యలో గుమిగూడి ఉండడంతో స్థానిక ఎస్ ఐ రాజు తమ సిబ్బందితో అక్కడికి చేరుకుని ప్రజలను చెదరగొట్టారు. పోలీసులు హెలికాఫ్టర్ సిబ్బందికి భద్రత కల్పించారు. రిపేర్ కోసం మరో ఎలికాఫ్టర్ రానుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement