Thursday, May 2, 2024

Govt Jobs: నేటి నుంచి దరఖాస్తు ప్రక్రియ షురూ.. ఉద్యోగాలకు అర్హతలు ఇవే..

తెలంగాణ నిరుద్యోగులకు శుభ వార్త. రాష్ట్రంలో కొలువుల జాతర మొదలైంది. ఇప్పటికే వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులకు సంబంధించిన టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. గ్రూప్‌-1, పోలీసు ఉద్యోగాలకు సంబంధించిన దర‌ఖా‌స్తు ప్రక్రియ నేటి నుంచి ప్రారంభమవుతుంది. మొత్తం 18 శాఖల్లో 503 గ్రూప్‌-1 పోస్టుల కోసం ఈ నెల 31 వరకు, పోలీస్‌, ఎక్సైజ్‌, రవాణాశాఖల్లో మొత్తం 17,291 పోస్టులకు మే 20న రాత్రి 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

గ్రూప్‌-1 పోస్టులకు.. రీజినల్‌ ట్రాన్స్‌పోర్ట్‌ ఆఫీసర్‌ (ఆర్టీవో) ఉద్యోగాలకు బీటెక్‌ మెకానికల్‌, ఆటోమొబైల్‌ ఇంజినీరింగ్‌, అసిస్టెంట్‌ ట్రెజరీ అధికారి ఉద్యోగానికి డిగ్రీలో కామర్స్‌, ఎకనామిక్స్‌ లేదా గణితం సబ్జెక్టుల్లో కనీసం ద్వితీయ శ్రేణిలో ఉత్తీర్ణులై ఉండాలి.

అసిస్టెంట్‌ కమిషనర్‌ ఆఫ్‌ లేబర్‌ పోస్టుకు ఆర్ట్స్‌, సైన్స్‌, కామర్స్‌ డిగ్రీ వారు అర్హులే. ఇద్దరు అభ్యర్థులకు సమాన మార్కులు వస్తే లేబర్‌ వెల్ఫేర్‌ అండ్‌ పర్సనల్‌ మేనేజ్‌మెంట్‌ /ఇండస్ట్రియల్‌ లేబర్‌ రిలేషన్స్‌ స్పెషలైజేషన్‌తో సోషల్‌వర్క్‌ పీజీ పూర్తిచేసిన వారికి ప్రాధాన్యం ఇస్తారు.

డిస్ట్రిక్ట్‌ సోషల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ పోస్టుకు ఏదేని డిగ్రీ పూర్తిచేసిన వారు అర్హులు. ఇద్దరు అభ్యర్థులకు మార్కులు సమానంగా వస్తే సోషియాలజీ, సోషల్‌వర్క్‌లో డిగ్రీ ఉన్న వారికి ప్రాధాన్యం ఉంటుంది. మిగిలిన అన్ని పోస్టులకు ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. ఇక, పోలీస్‌, యూనిఫాం పోస్టులకు ఇంటర్‌, డిగ్రీ ఉత్తర్ణీత అయ్యి ఉండాలని ప్రభుత్వం పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement