Monday, May 6, 2024

ఏపీలో తెలంగాణ సీఎం ‘కేసీఆర్’ చిత్ర‌ప‌టానికి పాలాభిషేకం

తెలంగాణ సీఎం కేసీఆర్ కి సొంత రాష్ట్రంలోనే కాకుండా ఇత‌ర రాష్ట్రాల్లో కూడా అభిమానులు ఉన్నారు. కాగా తెలంగాణ నిరుద్యోగ యువ‌త విష‌యంలో కేసీఆర్ తీసుకున్న నిర్ణ‌యం ప‌ట్ల ఏపీ నిరుద్యోగ జేఏసీ కేసీఆర్ ని అభినందించింది. దాంతో కేసీఆర్ చిత్రపటానికి ఏపీలోని ప్రజలు పాలాభిషేకం చేశారు. కేసీఆర్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. అదే సమయంలో తమకు న్యాయం చేయాలంటూ స్లోగన్స్ చేశారు. తెలంగాణలో 80,039 ఉద్యోగాలుకు నోటిఫికేషన్ విడుదల,11,103 కాంట్రాక్టు ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేస్తూ కేసీఆర్ నిర్ణయం తీసుకున్నందుకు విశాఖలోని పబ్లిక్ లైబ్రరీ వద్ద కేసీఆర్ ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు ఏపీ నిరుద్యోగ జేఏసీ ప్రతినిధులు. హీరో కేసీఆర్ అంటూ నినాదాలు చేశారు. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా చేసిన పాదయాత్రలో ఇచ్చిన హామీ ప్రకారం 2,32,000 ఉద్యోగ ఖాళీలను తక్షణమే భర్తీ చేసేలా నోటిఫికేషన్ విడుదల చేయాలని ఏపీ నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు సమయం హేమంత్ కుమార్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉమ్మడి మహేష్ డిమాండ్ చేశారు. ఉద్యోగ దరఖాస్తుకు వయోపరిమితిని 47యేళ్లకు పెంచాలని, ఉద్యోగ విరమణ వయస్సు 60 యేళ్ళకు తగ్గించాలని కోరారు. లేనిపక్షంలో నిరుద్యోగులు నష్టపోతారని ప్రభుత్వానికి నిరసన తెలియజేశారు. వి వా౦ట్ జస్టిస్ అ౦టూ నినది౦చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement