Friday, April 26, 2024

పరిషత్ పోరుకు రైట్ రైట్.. యథావిథిగా పోలింగ్!

ఏపీ జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ఉత్కంఠకు తెరపడింది. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించుకోవచ్చునని హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది. సింగిల్ జడ్జి ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల్ని డివిజన్ బెంచ్ కొట్టేసింది. ఈ మేరకు బుధవారం నాడు హైకోర్టు.. తన తీర్పును వెల్లడించిండి. ఎన్నికల నిర్వహించేలా ఉత్తర్వులు ఇవ్వాలంటూ రాష్ట్ర ఎన్నికల సంఘం చేసిన అభ్యర్థనకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే, త‌మ నుంచి త‌దుప‌రి ఉత్త‌ర్వులు వ‌చ్చే వ‌ర‌కు ఫ‌లితాల‌ను ప్ర‌క‌టించ‌కూడ‌ద‌ని హైకోర్టు ఆదేశించింది. దీంతో గురువారం జ‌ర‌గాల్సిన ఎన్నిక‌లు య‌థాత‌థంగా జ‌ర‌గ‌నున్నాయి.

ఎస్ఈసీ పిటిషన్‌పై హైకోర్టులో వాడే వేడిగా వాదనలు జరిగాయి. ఎస్ఈసీ తరపున లాయర్ వాదనలు వినిపిస్తూ.. ఓటు హక్కు లేని వర్ల రామయ్య ఎలా పిటిషన్ ఎలా వేస్తారని ప్రశ్నించారు. ఎన్నికల అమలులో మినిమం, మ్యాగ్జిమమ్ ఉండదని.. గతంలో పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ ఇలాగే జరిగిందని తెలిపింది. పంచాయతీ ఎన్నికలకు ఎన్ని రోజులు కోడ్ అమలు చేశారని ధర్మాసనం ప్రశ్నించగా.. 24 రోజుల సమయం తర్వాత ఎన్నికలు జరిపామని ఎస్ఈసీ తెలిపింది. అన్ని రోజులు కోడ్ అమలు చేసినట్లే కదా అని వ్యాఖ్యానించింది. ఇక టీడీపీ నేత వర్ల రామయ్య తరపున లాయర్ వాదనలు వినిపించారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా పిటిషన్ వేయొచ్చని.. సుప్రీం కోర్టు నాలుగు వారాలు కోడ్ అమలు చేయాలని స్పష్టం చేసిన విషయాన్ని వివరించారు. సుప్రీం కోర్టు ఆదేశాలను ఎస్ఈసీ తెలుసుకోవాలన్నారు.

కాగా, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ గురువారం(ఏప్రిల్ 8) జరగాల్సి ఉండగా.. మంగళవారం(ఏప్రిల్ 6) హైకోర్టు సింగిల్ బెంచ్ స్టే ఇచ్చింది. హైకోర్టులో విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు 4 వారాల ఎన్నికల కోడ్ విధించలేదని పిటిషనర్లు వివరించారు. 7 రోజుల్లో ఎలా ఎన్నికలు నిర్వహిస్తారని ప్రశ్నించారు. ఈ వాదనలతో ఏకీభవించిన హైకోర్టు.. ఎన్నికల నోటిఫికేషన్‌పై స్టే విధించింది. మంగళవారం సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును ఎస్ఈసీ డివిజన్ బెంచ్‌లో సవాల్ చేసింది. గురువారమే పోలింగ్‌ ఉండటంతో… ఎన్నికలు జరిగేలా ఆదేశాలు ఇవ్వాలని హౌస్‌ మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. ఎస్ఈసీ, ఇతరుల వాదనలు విన్న ధర్మాసనం.. ఎన్నికల నిర్వహణకు సంబంధించి స్పష్టమైన తీర్పునిచ్చింది. దీంతో గురవారం యథావిథిగా పోలింగ్ జరగనుం

ఏప్రిల్ 1వ తేదీన పరిషత్‌ ఎన్నికలపై ఎస్ఈసీ నీలం సాహ్ని ఇచ్చిన నోటిఫికేషన్‌పై బీజేపీ, టీడీపీలు హైకోర్టుకు వెళ్లాయి. ఎన్నికల రాజ్యాంగ విరుద్ధంగా నిర్వహిస్తున్నారలంటూ తెలుగుదేశం నేత వర్ల రామయ్య హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ రెండు పిటిషన్లను విచారించిన హైకోర్టు సింగిల్ బెంచ్ ధర్మాసనం.. ఎన్నికలను నిలుపుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఎస్ఈ‌సీ త్రిసభ్య ధర్మాసనాన్ని ఆశ్రయించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement