Sunday, April 28, 2024

అంటే ..సుంద‌రానికీ చిత్రం నుంచి – మ‌రో అప్ డేట్

వివేక్ ఆత్రేయా డైరెక్ష‌న్ లో తెర‌కెక్కిన చిత్రం అంటే సుంద‌రానికీ. ఈ చిత్రంలో నాని హీరోగా న‌టిస్తున్నాడు. కాగా ఈ చిత్రంపై మొద‌టి నుంచి ప్రేక్ష‌కుల‌లో మంచి అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఇటీవ‌లే విడుద‌లైన ట్రైల‌ర్ అంచ‌నాల‌ను రెట్టింపు చేసింది. రొమాంటిక్ కామెడీ ఎంట‌ర్టైన‌ర్‌గా తెర‌కెక్కిన ఈ చిత్రం జూన్ 10న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ క్ర‌మంలో చిత్ర‌బృందం త‌ర‌చూ ఒక అప్‌డేట్‌తో ప్రేక్ష‌కులను అల‌రిస్తుంది. తాజాగా మ‌రో అప్‌డేట్‌ను మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. ఈ చిత్రంలోని ‘ఎంత.. చిత్రం’ అనే ల‌వ్ ట్రాక్‌ లిరిక‌ల్ సాంగ్‌ను మే 9 ఉద‌యం 11.07 నిమిషాల‌కు విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు మేక‌ర్స్ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు. ఈ పోస్ట‌ర్‌లో నాని, న‌జ్రియా భుజాల‌పై త‌ల వాల్చుతుంటే అడ్డుగా చేతిని పెడుతూ పెదాల‌పై చిరున‌వ్వును ఒలికిస్తుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement