Monday, April 29, 2024

‘అంటే.. సుందరానికీ’ సాంగ్ రిలీజ్ డేట్ ఫిక్స్​..

నేచుర‌ల్ స్టార్ నాని హీరోగా వివేక్ ఆత్రేయ ‘అంటే.. సుందరానికీస అనే సినిమాను రూపొందించారు. ఆచార వ్యవహారాలు బాగా పాటించే ఒక బ్రాహ్మణ ఫ్యామిలీకి చెందిన కుర్రాడిగా ఈ సినిమాలో నాని అల‌రించ‌నున్న‌ట్లు తెలుస్తోంది. అలాంటి వ్య‌క్తి ఫారెన్ టూర్ వెళ్తే ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి అనేదే కథ. ఈ సినిమాలో నాని జోడిగా నజ్రియా రొమాన్స్ చేయ‌నుంది. కాగా, మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించిన ఈ సినిమాను జూన్ 10వ తేదీన విడుదల చేస్తున్నారు. ఈ సినిమాకి వివేక్ సాగర్ సంగీతాన్ని అందించారు.

ఇప్ప‌టిదాకా ఈ సినిమా నుంచి వదిలిన అప్ డేట్స్ ఒక రేంజ్ లో రీచ్ అయ్యాయి. ఈ నేపథ్యంలో సినిమా నుంచి ‘ఎంత చిత్రం’ లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేయడానికి ముహూర్తాన్ని ఖరారు చేశారు. ఈ నెల 9వ తేదీన ఉదయం 11:07 నిమిషాలకు ఈ పాటను రిలీజ్ చేస్తున్న‌ట్టు చిత్రం యూనిట్ తెలిపింది. ఈ పాట యూత్ కి ఏ స్థాయిలో కనెక్ట్ అవుతుందో చూడాలి. నదియా.. రోహిణి కీలకమైన పాత్రలను పోషించిన ఈ సినిమాలో, నరేశ్ .. సుహాస్ .. రాహుల్ రామకృష్ణ కీల‌క పాత్రలలో కనిపించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement