Saturday, May 11, 2024

రాష్ట్రాన్ని కించపరిచేలా సెల్వమణి వ్యాఖ్యలు.. మంత్రి రోజాకు ఇంట్లోనే వ్యతిరేకత: ఎమ్మెల్సీ మంతెన‌

అమరావతి, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్‌లో షూటింగ్‌లు వద్దని మంత్రి రోజా భర్త, డైరెక్టర్‌ సెల్వమణి చేసిన వ్యాఖ్యలు రాష్ట్రాన్ని కించపరిచేలా, నష్టం చూకూర్చే విధంగా ఉన్నాయ‌ని టీడీపీ ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణ రాజు మండిపడ్డారు. శుక్రవారం మీడియాకు విడుదల చేసిన ఒక ప్రకటనలో ఏపీలో షూటింగ్‌లు వద్దని చెప్పడానికి సెల్వమణి ఎవరని నిలదీశారు. రాష్ట్రంలో టూరిజాన్ని అభివృద్ధి చేస్తామని మంత్రి రోజా స్పష్టం చేస్తుంటే ఆమె భర్త సెల్వమణి దీనికి విరుద్ధంగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఆయన వ్యాఖ్యలు దేనికి సంకేతమని నిలదీశారు. ఇంట్లో పరిస్థితులు చక్కదిద్దుకోలేని మంత్రి ఇక రాష్ట్రాన్ని ఏం అభివృద్ధి చేస్తారని ధ్వజమెత్తారు. సెల్వమణి చేసిన వ్యాఖ్యలకు మంత్రి రోజా తక్షణమే క్షమాపణ చెప్పాలని మంతెన సత్యనారాయణ రాజు డిమాండ్‌ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement