Friday, May 3, 2024

గెలుపునకు… చరిత్ర మలుపునకు మరోపేరు కేసీఆర్.. కవిత

హైదరాబాద్: గెలుపునకు, చరిత్ర మలుపునకు మరో పేరు సీఎం కేసీఆర్ అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో సాగుతోందని, దేశంలోనే రాష్ట్రాన్ని నెంబర్ వన్ గా తీర్చిదిద్దారని తెలిపారు. కేసీఆర్ సారధ్యంలో దేశం కూడా ప్రగతి పథంలో సాగాలని ఆకాంక్షించారు. సీఎం పుట్టినరోజు సందర్భంగా బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి ఆలయంలో కల్వకుంట్ల కవిత రాజశ్యామల పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు ఆమెకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆమె అమ్మవారికి బంగారు ఆభరణాలను సమర్పించారు.

ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని అమ్మవారిని మొక్కుకున్నానని తెలిపారు. బల్కంపేట ఆలయం రోజురోజుకు అభివృద్ధి చెందుతుందని, భక్తులకు మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. అలాగే సీఎం కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని నిర్వహించిన వాలీబాల్ పోటీల్లో విజేతలకు కవిత బహుమతులు అందించారు. ఆ సమయంలో ఆమె మాట్లాడుతూ…. గెలుపునకు, చరిత్ర మలుపునకు మరో పేరు సీఎం కేసీఆర్ అని అన్నారు. కాబట్టి అటువంటి వ్యక్తి పుట్టినరోజును మరిచిపోలేని విధంగా జరుపుకోవాలని తెలిపారు. సీఎం కేసీఆర్ అసాధ్యాన్ని సుసాధ్యంగా చేసి చూపించారని చెప్పారు. భారతదేశ అభివృద్ధికి ఇప్పుడు వేసిన అడుగు కూడా విజయవంతం అవుతుందని స్పష్టం చేశారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement