Saturday, April 27, 2024

మ‌రో 385మంది ఉద్యోగుల‌ను ఇంటికి పంపిన.. ఎడ్యుటెక్ కంపెనీ వేదాంతు

మ‌రో 385మంది ఉద్యోగుల‌ని ఇంటికి పంపించింది ప్ర‌ముఖ ఎడ్యుటెక్ కంపెనీ వేదాంతు. సేల్స్, హెచ్ ఆర్ విభాగాల్లోని ఈ ఉద్యోగులకు పింక్ స్లిప్ ఇచ్చినట్లు సమాచారం. పెరిగిపోతున్న ఖర్చుల భారాన్ని తగ్గించుకుని, సంస్థను లాభాల్లోకి నడిపించే క్రమంలో ఉద్యోగుల తొలగింపు తప్పలేదని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. తాజా తొలగింపులతో ఈ ఏడాది వేదాంతు తొలగించిన ఉద్యోగుల సంఖ్య 1,100 లకు చేరింది. ఈ ఏడాది జులైలో వంద మంది రెగ్యులర్ ఉద్యోగులతో పాటు 624 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను వేదాంతు తొలగించింది. దీంతో ప్రస్తుతం సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగుల సంఖ్య 3,300 మందికి తగ్గింది. వేదాంతు సహ వ్యవస్థాపకుడితో పాటు సీనియర్ ఉద్యోగులు చాలామంది తమ జీతాల్లో 50 శాతం కోత విధించుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement