Thursday, May 2, 2024

రాహుల్ ద్రవిడ్ మరో యాంగిల్.. ఇంద్రానగర్ గూండా!

ఇండియన్ మాజీ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ గురించి తెలియని వారు ఉండరు. ఎప్పుడూ మౌనంగా ఉండే ద్రవిడ్.. తన కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోయాడు. ట్రాఫిక్ లో కార్లోంచి లేచి.. ఇంద్రానగర్ గూండానురా నేను అంటూ హల్ చల్ చేశాడు. ద్రవిడ్ లోని మరో కోణాన్ని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ బయటపెట్టాడు. దీనికి సంబందించిన ఓ వీడియోను కోహ్లీ షేర్ చేయగా.. అది వైరల్ గా మారింది.

అసలు విషయం ఏంటంటే.. సినీ ప్రముఖులు, క్రికెటర్లు ఏదో ఒక యాడ్ లో కనిపించడం సర్వ సాధారణం. తాజాగా ద్రవిడ్ కూడా క్రెడిట్ కార్డ్ బిల్ పేమెంట్ యాప్ కి సంబంధించి ఓ యాడ్ లో నటించాడు. దీనిలో భాగంగా ద్రవిడ్ ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కుపోయాడు. అర్జెంట్ పని ఉండటం.. ట్రాఫిక్ ఎంతసేపటికి కదలకపోవడంతో చాలా ఫ్రస్టేట్ అవుతూ ఉంటాడు. పదే పదే స్టీరింగ్ నొక్కుతూ, పక్కన ఉన్న వారిని చూసి కోపంతో వుగిపోతాడు. అంతే కాదు చేతిలో బ్యాట్ పట్టుకుని.. కార్ల అద్దాలు పగలకొట్టేస్తాడు. ఆ తర్వాత కారు రూఫ్ టాప్ నుంచి నిలపడి నేను ఇందిరానగర్ కి గూండాను అంటూ గట్టిగా అరుస్తాడు. ఇదంతా క్రెడిట్ కార్డ్ కి సంబంధించిన యాడ్. దీనిని కోహ్లీ ట్విట్టర్ లో షేర్ చేశాడు.  తాను ఎప్పుడు ఇంత కోపంతో ఉండే ద్రవిడ్ ను చూడలేదంటూ ట్వీట్ చేశాడు. ఈ వీడియో వైరల్ గా మారింది. దీనిపై నెటిజన్లు పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. రాహుల్ ద్రవిడ్ లో ఈ యాంగిల్ తాము ఎప్పడూ చూడలేదంటూ కామెంట్లు పెడుతున్నారు.  

https://twitter.com/imVkohli/status/1380451732690411521
Advertisement

తాజా వార్తలు

Advertisement