Monday, May 6, 2024

మ‌రోసారి ప్రేమ‌లో అమీజాక్స‌న్ – హాలీవుడ్ న‌టుడితో డేటింగ్

అమీ జాక్స‌న్ తెలుగువారికి ప‌రిచ‌యం ఉన్న న‌టి..రోబో2.0లో ర‌జ‌నీకాంత్ తో క‌లిసి న‌టించింది. ప‌లు తెలుగు,త‌మిళ చిత్రాల్లో కూడా మెరిసింది ఈ బ్యూటీ.కాగా పెళ్లి కాకుండానే కుమారుడికి జ‌న్మ‌నిచ్చి వార్త‌ల్లో నిలిచింది. అమీ జాక్సన్ జార్జ్ పనయిటోతో రిలేషన్ షిప్‌లో ఉండేది. వీరిద్దరికీ 2019 ప్రారంభంలో నిశ్చితార్థం జరిగింది.వీరిద్దరికీ ఒక కొడుకు ఉన్నాడు. అమీ .. జార్జ్ 2020లో వివాహం చేసుకుందాం అనుకున్నారు. అయితే అనూహ్యంగా వీరిద్ద‌రూ 2021లో విడిపోయిన సంగ‌తి తెలిసిందే. అమీ జాక్సన్ కొత్తగా ప్రేమలో ప‌డింది. హాలీవుడ్ ప్రముఖ నటుడు ఎడ్ వెస్ట్‌విక్‌తో అమీ జాక్సన్ డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అమీ .. ఎడ్ కలిసి తిరుగుతున్నారు. అమీ జాక్సన్ లండన్‌లో తన సెలవులను గడుపుతోంది. తన కొడుకుతో కలిసి లండన్‌లో ఉంటోంది. ఎడ్ వెస్ట్‌విక్‌తో కలిసి లండన్ వీధుల్లో తిరుగుతూ కనిపించింది అమీజాక్స‌న్. కాగా వీరిద్ద‌రు వర్కౌట్ దుస్తుల్లో కనిపించారు.ఎడ్ వెస్ట్‌విక్ ..అమీ జాక్సన్ చేతులు పట్టుకుని కనిపించారు. వీరిద్దరి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఎడ్ .. అమీల వ్యవహారం గురించి చర్చలు ఇప్పుడు అంతటా చ‌ర్చ జ‌రుగుతోంది. వీరిద్దరూ కలిసి ఉన్న ఫోటోలు కూడా వైరల్‌గా మారాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement