Friday, April 26, 2024

కొండ చూపు బీజేపీ వైపు, ఇప్పటికే సీనియర్లతో భేటీ.. మ‌రి చేరిక ఎప్పుడో?

ఉమ్మడిరంగారెడ్డి, ప్రభన్యూస్‌బ్యూరో : చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి బీజేపీ వైపు అడుగులు వేస్తున్నారు…పార్టీ సీనియర్లతో వరుస భేటీల నేపథ్యంలో చేరిక పక్కా అనే ప్రచారం సాగుతోంది…తన ప్రథమ శత్రువు కేసీఆర్‌ ఆయనను ఓడించే పార్టీలో చేరతానని ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే…కాకపోతే తెరాస ప్రభుత్వంపై యాక్షన్‌ తీసుకుంటే రియాక్షన్‌ వస్తుందని కొండా గట్టిగా నమ్ముతున్నారు. అందులో భాగంగానే కొన్ని ప్రతిపాదనలు బీజేపీ పెద్దలకు చెప్పినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం….కొండా విశ్వేశ్వర్‌రెడ్డిని బీజేపీలోకి తీసుకవచ్చేందుకు పార్టీ సీనియర్లు కృషి చేస్తున్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లాలో పాదయాత్ర చేస్తున్న బండి సంజయ్‌ని రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జీ తరుణ్‌చుగ్‌ను కూడా కొండా కలిశారు…ఈనెలలో రంగారెడ్డి జిల్లాలో కేంద్ర హోం మంత్రి అమిత్‌షా బహిరంగ సభ ఉంది. ఆరోజు పార్టీలో చేరేలా కొండాపై వత్తిడీలు వస్తున్నారు…బీజేపీలో చేరిక పక్కాగా కనిపిస్తోంది…ఎప్పుడనేది మాత్రం ఎదురుచూడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి…..

చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి బీజేపీ వైపు అడుగులు వేస్తున్నారు…అన్ని రకాల వత్తిడీలు వస్తున్న నేపథ్యంలో ఆయన ఆ పార్టీలో చేరేందుకు సుముఖంగా కనిపిస్తున్నట్లు ఫ్రచారం సాగుతోంది. పార్టీ సీనియర్లతో వరుస భేటీల నేపథ్యంలో కొండా ఆ పార్టీలో చేరతారనే ప్రచారం మాత్రం జోరుగా సాగుతోంది. తన క్యాడర్‌తో చర్చించిన తరువాత నిర్ణయం చెబుతామని చెబుతున్నా బీజేపీలో చేరేది మాత్రం పక్కాగా కనిపిస్తోంది. 2014పార్లమెంట్‌ ఎన్నికల్లో చేవెళ్ల ఎంపీగా విజయం సాధించారు. 2017లో ఆ పార్టీకి రాజీనామ చేసి కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. అప్పట్లో రవాణాశాఖ మంత్రిగా కొనసాగిన పట్నం మహేందర్‌రెడ్డికి కొండా విశ్వేశ్వర్‌రెడ్డిల మధ్య రాజకీయ విభేదాలు నెలకొనడంతో ఆయన తెరాసకు దూరమయ్యారు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమిపాలయ్యారు. మధ్యలో కాంగ్రెస్‌ విధానాలు నచ్చకపోవడంతో ఆ పార్టీకి రాజీనామ చేశారు. రేవంత్‌రెడ్డికి టీపీసీసీ పగ్గాలు ఇచ్చిన తరువాత వీరిద్దరు పలుమార్లు భేటీ అయ్యారు. తిరిగి కాంగ్రెస్‌లో చేరతారనే ప్రచారం కూడా సాగింది. ఇటీవల ఆయన బీజేపీ సీనియర్లతో భేటీ అవుతుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. పాదయాత్ర చేస్తున్న బండి సంజయ్‌ను ఇటీవల కొండా కలిశారు. మరుసటి రోజే పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జీ తరుణ్‌చుగ్‌ను కూడా కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. రాజకీయంగా క్లీన్‌ చీట్‌ ఉన్న నేత కావడంతో బీజేపీ ఇటు కాంగ్రెస్‌ నేతలు తమ పార్టీలో చేరాలంటే తమ పార్టీలో చేరాలనే వత్తిడీలు విశ్వేశ్వర్‌రెడ్డిపై చేస్తున్నారు. రాజకీయ కుటుంబం కావడం కూడా ప్రాముఖ్యత నెలకొంది..బీజేపీలో చేరేది పక్కాగా కనిపిస్తోంది. ఎప్పుడనేది మాత్రం ఇంకా ముహూర్తం ఖరారు చేయలేదు. ఈనెలలో మహేశ్వరం నియోజకవర్గం పరిధిలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా బహిరంగ సభ ఉంది. ఆ రోజు పార్టీలో చేరేలా పార్టీసీనియర్లు ప్లాన్‌ చేస్తున్నారు. అమిత్‌షా ఆధ్వర్యంలో పార్టీలో చేరతారా లేక ఢిల్లిలో ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలిసి పార్టీలో చేరతారా అనేది ఆసక్తికరంగా మారింది. వరుస భేటీల నేపథ్యంలో బీజేపీలో చేరే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. కానీ తాను పార్టీలో చేరే విషయమై కొండా నుండి ఇంకా సానుకూల ప్రకటన రాలేదు. ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీలో చేరడమే మేలని తన ముఖ్య అనుచరులు, సన్నిహితులు తేల్చి చెబుతుండటంతో కొండా ఆ పార్టీలోనే చేరతారనే ప్రచారం మాత్రం జోరుగా సాగుతోంది.

యాక్షన్‌ ఉంటేనే… రియాక్షన్‌ వస్తుంది….

తెరాస ప్రభుత్వంపై యాక్షన్‌ తీసుకుంటేనే రియాక్షన్‌ స్పష్టంగా కనిపిస్తుందని కొండా విశ్వేశ్వర్‌రెడ్డి బీజేపీ పెద్దలకు చెప్పినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. పార్టీలో తానే కాదు తనలాంటి వాళ్లు చాలామంది చేరేందుకు ముందుకు వస్తారని పార్టీ పెద్దలకు తెరాసపై యాక్షన్‌కు ప్రతిపాదన పెట్టినట్లు తెలిసింది. కేంద్రం నుండి ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో చాలామంది నేతలు డైలామాలో ఉన్నారని వారికి నమ్మకం కలగాలంటే యాక్షన్‌ తీసుకున్నట్లు కనిపించాలని కొండా తన ప్రతిపాదన చెప్పినట్లు ప్రచారం సాగుతోంది. రాష్ట్రంలో తెరాస ప్రభుత్వం అధికారంలోకి రాకుండా చేయాలని పలుమార్లు కొండా పేర్కొన్న విషయం తెలిసిందే. ప్రజల్లో ఉన్న అనుమానాలను నివృత్తి చేయాలంటే ప్రభుత్వంపై యాక్షన్‌ మొదలుపెట్టాలని విశ్వేశ్వర్‌రెడ్డి ప్రతిపాదన పెట్టినట్లు ప్రచారం సాగుతోంది. దీనిపై ఢిల్లి పెద్జలు ఎలాంటి చర్యలు తీసుకుంటారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది….

చక్రం తప్పితున్న మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి….

- Advertisement -

కొండా విశ్వేశ్వర్‌రెడ్డిని బీజేపీలోకి తీసుకవచ్చేందుకు మహబూబ్‌నగర్‌ మాజీ ఎంపీ ఆముదాలపాడు జితేందర్‌రెడ్డి కీలక పాత్ర పోషిస్తున్నారు. తనతోపాటు ఎంపీగా పని చేయడం మొదటినుండి వీరిద్దరి మధ్య సన్నిహిత్యం ఉంది. అందులో భాగంగానే వీరిద్దరు పలుమార్లు భేటీ కావడంతోపాటు బండి సంజయ్‌…తరుణ్‌చుగ్‌ను కలవడంలో జితేందర్‌రెడ్డి కీలక పాత్ర పోషించినట్లు తెలిసింది. కొండా బీజేపీలోకి వస్తే అసెంబ్లి నియజకవర్గాలపై కూడా ప్రభావం చూపుతుందని పార్టీ పెద్దలు నమ్ముతున్నారు. అందులో భాగంగానే కొండాపై అన్ని రకాల వత్తిడీలు తెస్తున్నట్లు ప్రచారం సాగుతోంది….

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement