Tuesday, April 30, 2024

Jammu : వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా శ్రీవారి ఆల‌యాన్ని ప్రారంభించిన.. అమిత్ షా

టిటిడి ఆధ్వ‌ర్యంలో జ‌మ్మూకాశ్మీర్ లోని మాజీన్ ప్రాంతం అంద‌మైన శివాలిక్ అడ‌వుల మ‌ధ్య వెంక‌టేశ్వ‌ర ఆల‌యం భ‌క్తుల‌కి అందుబాటులోకి వ‌చ్చింది. కాగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా స్వామి వారి ఆలయాన్ని గురువారం ప్రారంభించారు. ఈ వేడుకకు కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్, కిషన్ రెడ్డి ప్రత్యక్షంగా హాజరయ్యారు. 62 ఎకరాల స్థలంలో నిర్మించిన ఈ ఆలయం జమ్మూ ప్రాంతంలోని అతిపెద్ద దేవాలయాలలో ఒకటిగా మారనుంది. అలాగే కేంద్ర పాలిత ప్రాంతంలో మతపరమైన, తీర్థయాత్రా పర్యాటకాన్ని పెంచే అవకాశాలు ఉన్నాయి. రూ.30 కోట్ల అంచనా వ్యయంతో టీటీడీ నిర్మించిన జమ్మూలోని ఈ గుడి ఆంధ్రప్రదేశ్ వెలుపల నిర్మించిన ఆరో శ్రీ వేంకటేశ్వర ఆలయం. మిగతా ఐదు ఆలయాలను తిరుమల తిరుపతి దేవస్థానం హైదరాబాద్, చెన్నై, కన్యాకుమారి, ఢిల్లీ, భువనేశ్వర్ లలో నిర్మించింది. రాయ్ పూర్, అహ్మదాబాద్ లలో కొత్త ఆలయాలు కూడా నిర్మించనుంది. జమ్మూ లో శ్రీ వేంకటేశ్వర్ ఆలయాన్ని భక్తుల కోసం ఉచితంగా అందుబాటులోకి తీసుకొచ్చామని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. మాతా వైష్ణోదేవి ఆలయం ఉన్న జమ్మూ- కత్రా మధ్య మార్గంలో ఈ ఆలయం ఉందని ఆయన చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement