Friday, April 26, 2024

గాల్కాడ్ స‌మీపంలో అమెరికా మిలిట‌రీ దాడులు.. 30మంది తీవ్ర‌వాదులు హ‌తం

ఇస్లామిక్ అల్ శ‌బాబ్ కి చెందిన 30మంది తీవ్ర‌వాదులు హ‌త‌మైన‌ట్లు అమెరికా ఆఫ్రికా క‌మాండ్ తెలిపింది. సోమాలియాలోని గాల్కాడ్‌ టౌన్‌ సమీపంలో అమెరికా మిలిటరీ దాడులు నిర్వహిస్తుంది. అల్‌ శబాబ్‌ సంస్థకు చెందిన 100 మందికిపైగా తీవ్రవాదులు దాడులు చేశారని, వారిని నిలువరించేందుకు ఆత్మరక్షణలో భాగంగా సోమాలియా ఆర్మితో కలిసి యూఎస్‌ ఆర్మీ దాడులు చేసిందని తెలిపింది. ఈ దాడిలో సాధారణ పౌరులు ఎవరూ గాయపడలేదని చెప్పింది. సోమాలియాలో ఉగ్రవాదులను ఎదుర్కొనేందుకు గతేడాది మే నుంచి అమెరికా సైన్యం ఆ దేశంలో మోహరించింది. ఉగ్రవాదులతో జరుగుతున్న పోరులో సోమాలియా ఆర్మితో కలిసి యూఎస్‌ సైనికులు పాల్గొంటున్నారు. ఆ దేశ సైన్యానికి శిక్షణతోపాటు సహాయం అందిస్తున్నది.

Advertisement

తాజా వార్తలు

Advertisement