Thursday, February 2, 2023

విద్యుదాఘాతంతో రైతు మృతి

చిట్యాల : విద్యుదాఘాతంతో రైతు మృతి చెందిన ఘ‌ట‌న జయశంకర్ జిల్లా చిట్యాల మండలంలో చోటుచేసుకుంది. మండలంలోని తిరుమలాపురం గ్రామ శివారు రామచంద్రపురంలో గాజే రమేష్( 40) రైతు ఆదివారం ప్రమాదవశాత్తు విద్యుదాఘాతంతో ట్రాన్స్ ఫార్మ‌ర్ వద్ద అక్కడికక్కడే మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. ట్రాన్స్ ఫార్మ‌ర్ ఫీజు వైరు వేస్తుండగా విద్యుదాఘాతంతో మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. మృతునికి భార్య, కుమారుడు, కూతురు ఉన్నారు. రైతు మృతితో కుటుంబంతోపాటు గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. బాధిత రైతు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని ప్రజలు కోరుతున్నారు .

Advertisement

తాజా వార్తలు

Advertisement