Thursday, May 2, 2024

అగ్రరాజ్య అధినేత పాడు బుద్ధి, ఓ మహిళ గురించి ఛీప్​ కామెంట్స్.. తిట్టిపోస్తున్న నెటిజన్లు!​

అగ్రరాజ్య అధినేత తన వక్రబుద్ధిని బయటపెట్టాడు.. అప్పట్లో తన వయసు 30, ఆమె వయసు 12 అనీ.. తమ ఇద్దరి మధ్య ఉన్న దోస్తానా గురించి కామెంట్స్​ చేశాడు.. ఇప్పుడిది సోషల్​ మీడియాలో వైరల్​గా మారింది. చాలామంది బైడెన్​ కామెంట్స్​పై సీరియస్​గా రియాక్ట్​ అవుతున్నారు. ఛీప్​ మెంటాలిటీ అని తిట్టిపోస్తున్నారు.

‌‌– డిజిటల్​ మీడియా, ఆంధ్రప్రభ

అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట దుమారం రేపుతున్నాయి. పలువురు నెటిజన్లు బైడెన్‌ను ఛీ కొడుతున్నారు. అమెరికాలో నేషనల్ ఎడ్యుకేషన్ అసోసియేషన్‌కు సంబంధించిన ఓ ప్రోగ్రామ్​లో బైడెన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అక్కడ ఉన్న ఒక మహిళను గుర్తించారు. ఆమె గురించి చెప్తూ.. ‘మా ఇద్దరి మధ్య స్నేహం చాలా కాలం నాటిది. అప్పట్లో తన వయసు 12, నా వయసు 30. కానీ ఎన్నో పనులు చేయడంలో ఆమె నాకు హెల్ప్​ చేసింది’ అని బైడెన్ చెప్పారు.

అయితే.. ఈ మాటలు విన్న చుట్టుపక్కలున్న టీచర్లంతా పకపకా నవ్వారు. దీన్ని షేర్ చేసిన కొందరు నెటిజన్లు ‘బైడెన్ ఏం మాట్లాడుతున్నాడో వీళ్లకు అర్థం కావడం లేదా? నవ్వుతున్నారేంటి?’ అని ప్రశ్నిస్తున్నారు. అదే సమయంలో బైడెన్‌కు సపోర్ట్ ఇస్తున్న మరికొందరేమో ‘ఆమె వయసు 30, నా వయసు 12 అని చెప్పబోయి నాలుక మడతపడిందంతే’ అని అంటున్నారు. ఏదేమైనా బైడెన్ వ్యాఖ్యలు చాలా మందిని డిస్టర్బ్ చేస్తున్నాయని తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement