Thursday, May 16, 2024

అంబేద్క‌ర్ ని ఆరాధిస్తా – ఫ్రీగా అంబేద్క‌ర్ జీవిత నాట‌క ప్ర‌ద‌ర్శ‌న – సీఎం కేజ్రీవాల్

మ‌న‌దేశంలోని గొప్ప నాయ‌కుల్లో అంబేద్క‌ర్ ఒక‌ర‌నీ, ఆయ‌న జీవితం స్ఫూర్తిధాయ‌క‌మ‌ని ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ అన్నారు. భార‌త రాజ్యాంగ పితామ‌హుడు బిఆర్ అంబేద్క‌ర్ జీవితంపై రూపొందించిన నాట‌కాన్ని ఫిబ్ర‌వ‌రి 25 నుంచి, మార్చి 12 వరకు జేఎల్‌ఎన్ స్టేడియంలో ప్ర‌ద‌ర్శిస్తామ‌ని అరవింద్ కేజ్రీవాల్ వెల్ల‌డించారు. ఈ నాటకాన్ని జనవరి 5 నుండి ప్రదర్శించాల్సి ఉంది. క‌రోనా కేసుల పెరుగుదల కారణంగా ఈ నాట‌క ప్ర‌ద‌ర్శ‌న‌లను వాయిదా వేశారు. జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో ప్రతిరోజూ రెండు షోలను నిర్వహిస్తామ‌నీ కేజ్రీవాల్ చెప్పారు. ఈ నాటకాన్ని పూర్తిగా ఉచితంగా చూడొచ్చ‌ని అన్నారు. అంబేద్కర్ జీవితం స్ఫూర్తిధాయ‌క‌మ‌ని ..ఆయనకు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు, అభిమానులు ఉన్నారనీ, తాను కూడా బాబాసాహెబ్ అంబేద్క‌ర్ భ‌క్తుడ‌నీ, అతనిని ఆరాధిస్తానని తెలిపారు.

అంబేద్క‌ర్ జీవితాంతం పోరాడి పేదలకు, దళితులకు న్యాయం జరిగేలా పోరాడారని, పేద కుటుంబం నుండి వచ్చి న్యాయ మంత్రి అయ్యాడని కేజ్రీవాల్ వివరించారు. గ‌తేదాడి డిసెంబర్‌లో మహాపర్నిర్వాణ దివాస్ సందర్భంగా.. బాబా సాహెబ్ జీవితం ఆధారంగా నాట‌కాన్ని రూపొందించి, ప్రదర్శనను నిర్వహించాలని ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయించింది. తద్వారా.. ఢిల్లీ ప్రజలు ఆయన జీవితం నుండి ప్రేరణ పొందారని, ఈ నాట‌క ప్ర‌ద‌ర్శ‌న‌ను జనవరి 5 నుంచి ప్రారంభించాల‌ని నిర్ణ‌యించింది. కానీ, ఒమిక్రాన్ కారణంగా వాయిదా వేయాల్సి వచ్చింది. ఇది ఇప్పుడు ఫిబ్రవరి 25 నుండి మార్చి 12 వరకు ప్ర‌ద‌ర్శించాల‌ని నిర్ణ‌యించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement