Sunday, May 5, 2024

ప్ర‌తి విద్యార్థి నాణ్య‌మైన విద్య‌ను పొందాల‌నేది అంబేద్క‌ర్ క‌ల : కేజ్రీవాల్

దేశంలోని ప్ర‌తి విద్యార్థి నాణ్య‌మైన విద్య‌ను పొందాల‌నేది డాక్ట‌ర్ బీఆర్ అంబేద్క‌ర్ క‌ల అని ఢిల్లీ ముఖ్య‌మంత్రి అర‌వింద్ కేజ్రీవాల్ అన్నారు. ఢిల్లీలోని 240 ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో దాదాపు 12,430 కొత్త స్మార్ట్ క్లాస్ రూమ్‌ల‌ను ముఖ్య‌మంత్రి కేజ్రీవాల్ ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా సీఎం కేజ్రీవాల్ మాట్లాడుతూ.. దురదృష్టవశాత్తూ, స్వాతంత్ర్యం వచ్చి 75 ఏండ్లు గడిచినా ఇతర రాష్ట్రాల్లో అంబేద్కర్ కల నెరవేరలేదని అన్నారు. త‌మ ప్ర‌భుత్వం గ‌త ఏడేండ్ల‌లో 7 వేల త‌ర‌గ‌తి గ‌దుల‌ను నూత‌నంగా నిర్మించింద‌న్నారు. మ‌రి ఈ ఏడేండ్ల కాలంలో కేంద్రం 20 వేల క్లాస్ రూమ్‌ల‌ను కూడా ఏర్పాటు చేయ‌లేక‌పోయింద‌ని ఆయ‌న ధ్వ‌జ‌మెత్తారు. ఈ కార్య‌క్ర‌మంలో విద్యా శాఖ మంత్రి మ‌నీష్ సిసోడియా, హోంమంత్రి స‌త్యేంద‌ర్ జైన్‌తో పాటు ప‌లువురు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement