Friday, April 26, 2024

10వేల మందిని ఉద్యోగాల నుంచి తొలగింపు.. నోటిఫికేషన్ ఇచ్చిన అమెజాన్

ఆర్థికమాంద్యం నేపథ్యంలో ఖర్చులను తగ్గించుకునేందుకు నడుం బిగించింది అమెజాన్..దాంతో ప్రపంచ వ్యాప్తంగా తమ కంపెనీలో పని చేస్తున్న వారిలో దాదాపు 10 వేల మందిని ఉద్యోగాల నుంచి తొలగించనుంది. తొలగింపు ప్రక్రియ బుధవారం ప్రారంభమవగా.. తాజాగా అధికారిక ప్రకటన వెలువడింది. అసాధారణ, అనిశ్చిత ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో తమ శ్రామిక శక్తిని తగ్గిస్తున్నట్టు అమెజాన్ నోటిఫికేషన్ ఇచ్చింది. అమెజాన్ డివైజెస్, సర్వీసెస్ సీనియర్ ఉపాధ్యక్షుడు డేవిడ్ లింప్ పేరిట వెలువడిన ఈ అధికారిక ప్రకటనలో ప్రభావిత ఉద్యోగుల తొలగింపుల గురించి కంపెనీకి ఇప్పటికే తెలియజేశామని చెప్పారు.

వేటు ఎదుర్కొంటున్న ప్రతి ఉద్యోగితో మాట్లాడి, కొత్త ఉపాధి మార్గాలను అందించేందుకు సహాయం చేస్తామని వెల్లడించింది. ఈ మేరకు ప్రభావిత ఉద్యోగులకు తొలగింపు గురించి అధికారిక మెయిల్ పంపింది. వేటు ఎదుర్కొంటున్న వాళ్లు అమెజాన్ లో ఇతర విభాగాల్లో ఉద్యోగం సంపాదించుకోవడానికి రెండు నెలల సమయం (నోటీస్ టైం) ఇచ్చింది. సదరు ఉద్యోగులు కొత్త పాత్రను కనుగొనడంలో విఫలమైతే, విభజన చెల్లింపు, పరివర్తన ప్రయోజనాలు, బయట జాబ్ ప్లేస్ మెంట్ కు సహాయం అందించే ప్యాకేజీ అందిస్తామని హామీ ఇచ్చింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement