Friday, April 19, 2024

గోవా డ్రగ్స్ కేసులో.. ఎడ్విన్ బెయిల్ పై విడుదల

గోవా డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన కీలక నిందితుడు ఎడ్విన్ బెయిల్ పై విడుదలయ్యాడు. హైదరాబాదులోని చంచల్ గూడా జైలు నుంచి ఎడ్విన్ బెయిల్ పై విడుదల అయినట్లు సమాచారం. కాగా డ్రగ్స్ కేసులో ఈ నెల 5వ తేదీన ఎడ్విన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. గోవాలో నెలరోజుల పాటు గాలించిన తెలంగాణ పోలీసులు ఎడ్విన్ ను అదుపులోకి తీసుకొన్న సంగతి తెలిసిందే.
హైదరాబాద్ కు తీసుకొచ్చి ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి జైలుకు తరలించారు.

మత్తు మాఫియా మాదకద్రవ్యాల కేసులో ప్రధాన నిందితుడు ఎడ్విన్ ను పోలీసులు అరెస్ట్ చేసి పది రోజులు కూడా గడవక ముందే బెయిల్ పై విడుదల కావడం చర్చనీయాంశంగా మారింది. హైదరాబాద్ లో ఎడ్విన్ పై మూడు కేసులు నమోదు కాగా… సికింద్రాబాద్ పరిధిలోని రాంగోపాల్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన కేసులో ఎడ్విన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే మరో రెండు కేసుల్లో ఎడ్విన్ ముందస్తు బెయిల్ తెచ్చుకున్న విషయం విధితమే.

Advertisement

తాజా వార్తలు

Advertisement