Saturday, April 27, 2024

అమెజాన్ కి రూ. 202కోట్ల జ‌రిమానా : ఎందుకో తెలుసా

ప్యూచ‌ర్ రిటైల్ తో ఒప్పందం చేసుకుంది అమెజాన్.. కాగా కొన్ని ఉల్లంఘ‌న‌ల‌కు పాల్ప‌డిన‌ట్టు తేలడంతో భారీ జ‌రిమానా వేసింది. కాంపిటీష‌న్ క‌మిష‌న్ ఆఫ్ ఇండియా ఈ జ‌రిమానా విధించింది. ఈ మేర‌కు ఫ్యూచర్ కూపన్స్ ప్రైవేట్ లిమిటెడ్ లో వాటాల కొనుగోలు ఒప్పందాన్ని నిలిపివేస్తూ, రూ.202 కోట్ల జరిమానా చెల్లించాలంటూ అమెజాన్ ను ఆదేశించింది. ఫ్యూచర్ గ్రూప్ కు చెందిన ఫ్యూచర్ కూపన్స్ సంస్థలో అమెజాన్ రెండేళ్ల కిందట 49 శాతం పెట్టుబడులు పెట్టింది. తద్వారా ఫ్యూచర్ గ్రూప్ లో అమెజాన్ కు 9.82 శాతం వాటా ఏర్పడింది.

అంతేకాదు, ఫ్యూచర్ గ్రూప్ ను కొనుగోలు చేసేందుకు అమెజాన్ కు అధికారం లభించినట్టయింది. అయితే, ఫ్యూచర్ గ్రూప్, రిలయన్స్ మధ్య రూ,24,713 కోట్ల విలువ చేసే ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందాన్ని అమెజాన్ అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ లో సవాల్ చేసింది. అటు, ఫ్యూచర్ గ్రూప్ సీసీఐకి ఫిర్యాదు చేసింది.ఈ నేపథ్యంలో, కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) తాజా నిర్ణయం తీసుకుంది. గతంలో ఫ్యూచర్ రిటైల్ తో ఒప్పందం కోసం తాను అమెజాన్ కు ఇచ్చిన అనుమతిని సస్పెండ్ చేసింది. రెగ్యులేటరీ అనుమతులు తీసుకునే అంశంలో అమెజాన్ కొన్ని అంశాలను దాచిందని సీసీఐ ఆరోపించింది. ఈ ఒప్పందాన్ని పునఃపరిశీలన చేయాల్సి ఉంటుందని పేర్కొంది. మ‌రి ఈ భారీ జ‌రిమానాని అమెజాన్ చెల్లిస్తుందా లేదా అనేది తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement