Tuesday, April 16, 2024

క‌రోనా కొత్త కేసులు : హైద‌రాబాద్ లో అత్య‌ధికం

గ‌డ‌చిన 24గంట‌ల్లో 39,781క‌రోనా శాంపిల్స్ ప‌రీక్షించ‌గా 181పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. గ్రేటర్ హైదరాబాద్ లో అత్యధికంగా 84 కొత్త కేసులు వ‌చ్చాయి. హనుమకొండ జిల్లాలో 14, రంగారెడ్డి జిల్లాలో 13 కేసులు గుర్తించారు.కాగా 203 మంది కరోనా నుంచి కోలుకోగా, ఒకరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 6,79,245 పాజిటివ్ కేసులు నమోదు కాగా 6,71,450 మంది కోలుకున్నారు. ఇంకా 3,782 మంది చికిత్స పొందుతున్నారు. కరోనాతో మరణించినవారి సంఖ్య 4,013కి పెరిగింది. కాగా క‌రోనా కేసులు పెరుగుతున్నాయి. మాస్క్ లు త‌ప్ప‌నిస‌రిగా ధ‌రించాల‌ని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement