Sunday, May 5, 2024

అల్లు అర్జున్​కి అదిరిపోయే వెల్​కమ్​.. పూలతో ముగ్గేసి స్వాగతించిన ఆర్హా!

ప్రస్తుతం అల్లు అర్జున్ చార్ట్ బస్టర్ శ్రీవల్లిపై ఇంటర్నెట్ ట్రెండ్​ అవుతోంది. శ్రీవల్లి, పుష్ప: ది రైజ్‌లోని పాట రెండు వారాల నుండి ట్రెండింగ్‌లో ఉంది. ఎందుకంటే సెలబ్రిటీలు, అభిమానులు అల్లు అర్జున్ హుక్ స్టెప్‌ను నేయిల్ చేసిన వీడియోలతో సోషల్ మీడియాలో హల్​ చల్​ చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. అల్లు అర్జున్ 16 రోజుల తర్వాత దుబాయ్ నుండి ఇంటికి తిరిగి వచ్చారు. కాగా, అల్లు అర్జున్​కు తన చిన్న కూతురు గారాలపట్టి అర్హా నుండి గ్రాండ్​ వెలకమ్​ లభించింది. వెల్​ కమ్​ నానా అనే లెటర్స్​తో ముంగిట్లో పూలతో ముగ్గులా వేసి వెల్​కమ్ చెప్పింది. కాగా, ఈ ఫొటోని అల్లు అర్జున్​ ఇన్​స్టాలో షేర్​చేసి అభిమానులతో ఈ విషయాన్ని పంచుకోవడంతో ఈ ఫొటో ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతోంది.

అల్లు అర్జున్ రాబోయే చిత్రాలు..

పుష్ప: ది రైజ్ తర్వాత అల్లు అర్జున్ ఇప్పుడు సీక్వెల్ షూటింగ్‌ను తిరిగి ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది.  పుష్ప: రూల్ మార్చిలో ఎప్పుడైనా సెట్స్‌ పైకి వెళ్తుంది. పుష్ప రెండో భాగాన్ని డిసెంబర్ 2022లో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారు. పుష్పతో పాటు అల్లు అర్జున్‌కి వేణు శ్రీరామ్‌తో ఐకాన్,  కొరటాల శివతో రివెంజ్ థ్రిల్లర్ వంటి మూవీస్​ ఉన్నాయి. ఏఆర్ మురుగదాస్, ప్రశాంత్ నీల్, బోయపాటి శ్రీనుతో కూడా ఇంకా కథాపరమైన చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement