Friday, April 26, 2024

నా హీరోయిన్ ‘శ్రీ రాపాక‌’కి ఆల్ ది బెస్ట్ – రామ్ గోపాల్ వ‌ర్మ‌

ఓటీటీలో బిగ్ బాస్ ప్రారంభ‌మ‌యిన సంగ‌తి తెలిసిందే. 17మంది కంటెస్టెంట్ల‌తో ఈ షో ప్రారంభ‌మ‌యింది. ఈ షోలో కొందరు పాత కంటెస్టెంట్స్‌ కూడా ఉన్నారు. అలాగే.. ఈ 17 మందిలో ఓ హాట్‌ బ్యూటీ కూడా ఉంది. నగ్నం ఫేమ్‌ శ్రీ రాపాక.. బిగ్‌ బాస్‌ ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే.. ఈ హాట్‌ బ్యూటీ శ్రీ రాపకకు టాలీవుడ్‌ సంచలన దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ అండగా నిలిచాడు. తన హీరోయిన్‌ శ్రీ రాపాకకు ఆల్‌ ది బెస్ట్‌ అంటూ తన సోషల్‌ మీడియాలో ఓ వీడియోను పోస్టు చేశారు వర్మ. దీంతో ఈ వీడియో వైరల్‌ గా మారింది. గతంలో అరియానా, అషురెడ్డిలకు సపోర్టు చేసిన ఆర్జీవీ.. ఇప్పుడు శ్రీ రాపాకకు సపోర్టు చేస్తున్నారు. దీంతో.. అషు, అరియానాలకు ఈ విషయం అస్సలు మింగుడు పడటం లేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement