Thursday, April 25, 2024

అఖండ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో.. అల్లు అర్జున్.. రాజ‌మౌళి ..

హైద‌రాబాద్ శిల్ప‌క‌ళా వేదిక‌లో అఖండ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ జ‌ర‌గ‌నుంది. ఈ చిత్రంలో నంద‌మూరి బాల‌కృష్ణ హీరోగా న‌టిస్తున్నాడు..బోయ‌పాటి శీను డైరెక్ట‌ర్..ప్ర‌గ్యాజ‌శ్వాల్ హీరోయిన్ గా న‌టిస్తోంది. మిర్యాల ర‌వీంద‌ర్ రెడ్డి నిర్మాత‌. కాగా ఈ వేడుకకు ముఖ్య అతిథిగా అల్లు అర్జున్ ను ఆహ్వానించారు. ఇక స్పెషల్ గెస్టుగా రాజమౌళి రానున్నారు. ఈ విషయాన్ని కూడా అధికారికంగా వెల్లడిస్తూ, పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ రోజు సాయంత్రం 6 గంటల నుంచి ఈ వేడుక ప్రారంభం కానుంది.న‌టుడు శ్రీకాంత్ విలన్ గా నటించిన ఈ సినిమాలో, జగపతిబాబు ఒక కీలకమైన పాత్రను చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడీ ఈవెంట్ పై అంద‌రిదృష్టి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement