Thursday, April 25, 2024

రైతులతో రాజకీయాలా?: TRS, BJPపై కోదండ రెడ్డి ఫైర్

వరి కొనుగోలు విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా తెలంగాణ కాంగ్రెస్ పోరు బాట పట్టింది. హైదరాబాద్ లోని ఇందిరాపార్క్ వద్ద కాంగ్రెస్ వరి దీక్ష చేపట్టింది. ఈ సందర్భంగా జాతీయ కిసాన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు కోదండ రెడ్డి మాట్లాడుతూ.. వరి రైతుల బాధలు తెలియజేస్తున్నాం తప్ప..కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు చేయలేదన్నారు. టిఆర్ఎస్, బీజేపీలు తమ చేతిలో అధికారం ఉన్నా…రైతులతో రాజకీయం చేసిందని విమర్శించారు. గతంలో ఎలాంటి సంకేతికత అందుబాటులో లేని సమయంలో కూడా కాంగ్రెస్ వరి ధాన్యం కొనుగోలు చేసిందని గుర్తు చేశారు. రైతులకు సంకెళ్లు వేసిన చరిత్ర కేసీఆర్ ది అని విమర్శించారు. వరి పండించమని చెప్పేది కేసీఆరే..వద్దని చెప్పేది కూడా ఆయనేనని మండిపడ్డారు. కేసీఆర్ కు వ్యవసాయం గురించి ఏం తెలియదన్నారు. గాంధేయమార్గంలో దీక్ష చేస్తున్నామని కోదండ రెడ్డి తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement