Wednesday, December 7, 2022

ఘనంగా మహాగణపతి సుబ్రహ్మణ్యస్వామి నవగ్రహ మూర్తుల ప్రతిష్ఠాపన

జిన్నారం, (ప్రభ న్యూస్): జిన్నారం మండలం కిష్టయ్య పల్లి గ్రామంలోనీ వీరాంజనేయ స్వామి దేవాలయంలో ఈరోజు ఉదయం 9 గంటలకు శ్రీ శ్రీ శ్రీ మహా గణపతి, సుబ్రహ్మణ్య నవగ్రహ మూర్తి స్థిర ప్రతిష్ఠా మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు సంధయ్య నర్సింగ‌రావు పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ… తన తండ్రి సంధయ్య పాండు జ్ఞాపకార్థంగా దేవాలయంలో మహా గణపతి సుబ్రహ్మణ్య నవగ్రహ మూర్తులను ప్రతిష్టించినట్లు పేర్కొన్నారు. విగ్రహ ప్రతిష్టాపన అనంతరం ఆదివారం మహా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. గ్రామస్తులు, భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం  ఫేస్‌బుక్‌ట్విట్టర్  పేజీల‌ను ఫాలో అవ్వండి..

- Advertisement -
   

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement