Sunday, April 28, 2024

Akhanda Release: ‘అఖండ’గా బాలయ్య ఉగ్రరూపం.. టాక్ ఎలా ఉందంటే..

నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘అఖండ’ ఈ రోజు (డిసెంబర్ 2) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నందమూరి బాలకృష్ణ, ప్రగ్యా జైస్వాల్ జంటగా మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో ‘అఖండ’ తెరకెక్కింది. బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తున్న మూడో సినిమా ‘అఖండ’ కావడంతో దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి. గతంలో సింహా, లెజండ్ సినిమాలు బ్లాక్ బాస్టర్ హిట్స్ సాధించాయి. దీంతో అఖండపై భారీ అంచానాలు ఏర్పడ్డాయి. సినిమాపై పాజిటివ్ రివ్యూలు వస్తున్నాయి. 

బాలయ్య అఖండ రాకతో తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లు కలకలాడుతున్నాయి. పెద్ద సంఖ్యలో థియేటర్ల వద్దకు చేరుకున్న అభిమానులు.. జై బాలయ్య అంటూ నినాదాలు చేశారు. ఇప్పటికే పలు చోట్ల ప్రివ్యూ షోలు పడ్డాయి. తెల్లవారుజామున నాలుగు గంటల నుంచే హైదరాబాద్ కూకట్‌పల్లిలోని భ్రమరాంభ థియేటర్‌లో బెనిఫిట్ షో వేశారు. హీరో తారకరత్న, నిర్మాత దిల్‌రాజు, మిర్యాల రవీంద్ర థియేటర్ లో సినిమాను వీక్షించారు. ‘అఖండ’ చూసిన ఫ్యాన్స్ ట్విట్టర్ వేదికగా తమ అభిప్రాయాలు వెల్లడిస్తున్నారు. బాలకృష్ణ ఈ సినిమాలో విశ్వరూపాన్ని ప్రదర్శించారని చెబుతున్నారు. మూవీ ఫస్టాఫ్ అదిరిపోయిందని, మాస్ ఆడియన్స్‌ మెచ్చేలా బోయపాటి మార్క్ తో ఉందని అభిమానులు అంటున్నారు. సెకండాఫ్‌లో ఇంకా పీక్స్ లో ఉందని, బాలయ్య ఉగ్రరూపం చూపించారని చెబుతున్నారు. సినిమాలో ముఖ్య పాత్రలో నటించిన జగపతి బాబు, శ్రీకాంత్‌లు కూడా అద్భుతంగా ఉందని చెబుతున్నారు. పబ్లిక్ టాక్, ట్విట్టర్ రిపోర్ట్ ని బట్టి చూస్తే ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను రీచ్ అయిందని తెలుస్తోంది. మొదటి షో నుంచే సినిమాకు వస్తున్న పాజిటివ్ టాక్ చూస్తుంటే సినిమా బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ కొల్లగొట్టడం ఖాయంగా కనిపిస్తోంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం  ఫేస్‌బుక్‌ట్విట్టర్  పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement