Thursday, March 28, 2024

Gold Rate: మళ్లీ తగ్గిన బంగారం ధర.. నేటి రేట్లు ఇలా..

బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి గుడ్ న్యూస్. గత రెండు రోజులుగా దిగి వస్తున్న పసిడి ధర… తాజాగా మరోసారి దిగొచ్చింది. బంగారం ధర బాటలోనే వెండి ధర కూడా తగ్గింది. హైదరాబాద్ మార్కెట్‌లో గురువారం బంగారం ధర పడిపోయింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.280 తగ్గింది. దీంతో బంగారం ధర రూ.48,650కి చేరింది. ఇక, 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.250 తగ్గి రూ.44,600కి క్షీణించింది.

ఇక, బంగారం దారిలో వెండి రేటు కూడా పడిపోయింది. వెండి ధర రూ.200 తగ్గింది. దీంతో కేజీ వెండి ధర రూ.66,300కు చేరింది. బంగారం, వెండి కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది ఊరట కలిగించే అంశం.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం  ఫేస్‌బుక్‌ట్విట్టర్  పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement