Monday, April 29, 2024

అజిత్ వ‌లిమై రిలీజ్ డేట్ ఫిక్స్.. మార్చిలో ప్రేక్ష‌కుల ముందుకు

అజిత్ .. వినోద్ .. బోనీ కపూర్ కాంబినేషన్లో భారీ యాక్షన్ నేపథ్యంలో సాగే సినిమా వలిమై.. అజిత్ సరసన నాయికగా హుమా ఖురేషి నటించిన ఈ సినిమాలో ప్రతినాయకుడిగా కార్తికేయ కనిపించనున్నాడు. ఈ సినిమాకి యువన్ శంకర్ రాజా బాణీలను సమకూర్చగా, గిబ్రాన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ను అందించాడు. సంక్రాంతికే ఈ సినిమాను విడుదల చేయాలనుకున్నారుగానీ కుదరలేదు.

కాగా, ఈ సినిమాను మార్చి 4వ తేదీన విడుదల చేయాలనే ఆలోచనలో దర్శకనిర్మాతలు ఉన్నట్టుగా తెలుస్తోంది. వచ్చేనెలలో కరోనా తీవ్రత తగ్గనుందనే వార్తల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు. తమిళంతో పాటు తెలుగు .. హిందీ భాషల్లోను అదే రోజున ఈ సినిమాను విడుదల చేయనున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement