Friday, March 29, 2024

మార్చి 4న – హీరో అజిత్ వాలిమై

ద‌ర్శ‌కుడు వినోద్ తెర‌కెక్కిస్తోన్న చిత్రం వాలిమై. ఈ చిత్రానికి నిర్మాత బోనీక‌పూర్. ఈ మూవీలో త‌మిళ స్టార్ హీరో అజిత్ న‌టిస్తున్నాడు. సంక్రాంతికే ఈ సినిమాను విడుదల చేయాలనుకున్నారుగానీ కుదరలేదు. ఈ సినిమాను మార్చి 4వ తేదీన విడుదల చేయాలనే ఆలోచనలో దర్శకనిర్మాతలు ఉన్నట్టు స‌మాచారం. వచ్చేనెలలో కరోనా తీవ్రత తగ్గనుందనే వార్తల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారట‌. తమిళంతో పాటు తెలుగు .. హిందీ భాషల్లోను అదే రోజున ఈ సినిమాను విడుదల చేయనున్నారు. భారీ యాక్షన్ నేపథ్యంలో సాగే ఈ సినిమాకి యువన్ శంకర్ రాజా బాణీలను సమకూర్చగా, గిబ్రాన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ను అందించాడు. అజిత్ సరసన నాయికగా హుమా ఖురేషి నటించిన ఈ సినిమాలో ప్రతినాయకుడిగా కార్తికేయ కనిపించనున్నాడు. ఈ సినిమాలో ఆయన దోపిడీ దొంగల నాయకుడిగా కనిపిస్తాడని చెప్పుకుంటున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement