Thursday, May 9, 2024

అగ్నిపథ్​పై ఆగ్రహం,  నేడు భారత్​ బంద్.. అప్రమత్తమైన రాష్ట్రాలు​

కేంద్రం తీసుకొచ్చిన అగ్నిపథ్​కు నిరసనగా ఇవ్వాల (సోమవారం) కొన్ని సంస్థలు భారత్​ బంద్​కు పిలుపునిచ్చాయి. దీంతో రైల్వే ప్రొటెక్షన్​ ఫోర్​ (ఆర్​పీఎఫ్​), గవర్నమెంట్​ రైల్వే పోలీసుల (జీఆర్​పీ) అప్రమత్తమయ్యారు. రైల్వే స్టేషన్లు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల వద్ద బందోబస్త్​ ఏర్పాటు చేశారు.

కేంద్ర ప్రభుత్వం త్రివిధ దళాల్లో చేపట్టనున్న నియామకాలను అగ్నిపథ్​ స్కీము ద్వారానే చేపట్టనున్నట్టు ప్రకటించింది. దీంతో ఆర్మీ ఉద్యోగ అభ్యర్థులు దేశ వ్యాప్తంగా ఆందోళనలు చేపడుతున్నారు. అగ్నిపథ్​ని వాపస్​ తీసుకోవాలని, తక్కువ వయస్సుకే ఆర్మీ అభ్యర్థులను పరిమితం చేస్తే తమ భవిష్యత్​ ఆగమైతుందని ఇప్పటికే పలు రకాల పరీక్షలు ఎదుర్కొన్న అభ్యర్థులు అంటున్నారు.

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీరును నిరసిస్తూ దేశ వ్యప్తంగా ఆందోళనలు చేఏస్తున్నారు. అంతేకాకుండా పలు రాష్ట్రాల్లో ఈ ఆందోళనలు, నిరసనలు తీవ్ర రూపం దాల్చాయి. ఉత్తరప్రదేశ్​, బీహార్​, రాజస్థాన్​, మధ్యప్రదేశ్​ జార్ఖండ్​, ఉత్తరాఖండ్​ రాష్ట్రాలతో పాటు తెలంగాణలో రైల్వే స్టేషన్లలో విధ్వంసం సృష్టించారు.

- Advertisement -

ఆందోళనకారుల తీరుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకుంటున్నా ఎక్కడా తగ్గడం లేదు. ఆందోళనలను మరింత విస్తృతం చేస్తున్నారు. కాగా అందులో భాగంగా ఇవ్వాల (సోమవారం) దేశ వ్యాప్త బంద్​కు ఆర్మీ ఉద్యోగ అభ్యర్థులు పిలుపునిచ్చారు. దీంతో పలు రాష్ట్రాలు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నాయి. ప్రభుత్వ కార్యాలయాల వద్ద 144 సెక్షన్​ విధించాయి. ప్రజలు, యువకులు, విద్యార్థులు గుమిగూడి కనిపించవద్దని, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలుంటాయని ఆయా రాష్ట్రాల అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

బంద్​ నేపథ్యంలో కొన్ని రాష్ట్రాలు స్కూళ్లకు సెలవులు ప్రకటించాయి. స్టూడెంట్స్​ పాఠశాలలకు వచ్చి, ఆ తర్వాత ఇబ్బందులు ఎదుర్కోవడం ఎందుకన్న ఉద్దేశంతో పాటు వారి బాగోగులను దృష్టిలో పెట్టుకుని పాఠశాలలకు సెలవులు ప్రకటించినట్టు ఉన్నతాధికారులు తెలిపారు.

గతంలో జరిగిన హింసాత్మక ఘటనలను దృష్టిలో పెట్టుకుని పలు ప్రాంతాల్లో అధికారులు గట్టి భద్రతా చర్యలు చేపట్టారు. బీహార్​లోని కైమూర్​, భోజ్​పూర్​, బక్సర్​, ఔరంగాబాద్​, రోహ్తాస్​, తూర్పు చంపారన్​, పశ్చిమ చంపారన్​, నమస్తిపూర్​, నవాడా, బెగుసరాయ్​, లఖిసరాయ్​, సరన్​, వైశాలి, ముజఫర్​పూర్​, దర్భంగా, మధుబని, గయా, ఖగారియా, జెహనాబాద్​ వంటి ప్రాంతాల్లో ఆంక్షలు విధించడంతోపాటు ఇంటర్నెట్​ సేవలను కూడా నిలిపివేశారు. భారత్​ బంద్​ ప్రకటన నేపథ్యంలో పంజాబ్​లోని సున్నితమైన ప్రాంతాలు, సైనిక స్థావరాలు, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ భద్రతను మరింత పెంచారు.

కేరళలో భారీగా బలగాల మోహరింపు..

ఇక.. తెలంగాణలో ఆకస్మాత్తుగా జరిగిన సికింద్రాబాద్​ రైల్వే స్టషన్​ ఘటనను దృష్టిలో పెట్టుకుని దక్షిణ భారత దేశంలోని పలు రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. కేరళలో అయితే అల్లర్లు జరగనున్నాయన్న ఇంటెలిజెన్స్​ నివేదికల నేపథ్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ముందస్తుగా బలగాలను మోహరించారు. ఎటువంటి హింసకు తావులేకుండా చర్యలు చేపట్టినట్టు కేరళ పోలీసు అధికారులు వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement